AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BSNL Bharat Fiber: బీఎస్‌ఎన్‌ఎల్ బంపర్ ఆఫర్.. ఉచితంగా నాలుగు నెలల ఇంటర్నెట్.. పూర్తి వివరాలు ఇవిగో..!

ఇటీవలి ప్రమోషనల్ ఆఫర్‌లో భాగంగా, ప్రభుత్వ యాజమాన్యంలోని భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన వినియోగదారులకు కొన్ని అద్భుత ప్లాన్‌లను తీసుకొచ్చింది.

BSNL Bharat Fiber: బీఎస్‌ఎన్‌ఎల్ బంపర్ ఆఫర్.. ఉచితంగా  నాలుగు నెలల ఇంటర్నెట్.. పూర్తి వివరాలు ఇవిగో..!
Bsnl
Venkata Chari
|

Updated on: Oct 16, 2021 | 9:16 PM

Share

BSNL Fiber Free Plans: ఇటీవలి ప్రమోషనల్ ఆఫర్‌లో భాగంగా, ప్రభుత్వ యాజమాన్యంలోని భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన వినియోగదారులకు కొన్ని అద్భుత ప్లాన్‌లను తీసుకొచ్చింది. స్టేట్-బ్యాక్డ్ టెలికాం కంపెనీ ఇప్పటికే ఉన్న ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులకు నాలుగు నెలల పాటు ఉచిత సేవలను అందించబోతోంది.

బీఎస్‌ఎన్‌ఎల్‌ భారతదేశం అంతటా డీఎస్‌ఎల్, ఎఫ్‌టీటీహెచ్ సేవల వినియోగదారుల కోసం ఆఫర్లను అమలు చేస్తోంది. ముందస్తుగా 36 నెలలు, 3 సంవత్సరాలు చెల్లించే కస్టమర్లకు కంపెనీ నాలుగు నెలలు ఉచితంగా అందిస్తుంది.

ప్రమోషనల్ ఆఫర్‌లో భాగంగా, కస్టమర్‌లు కేవలం 36 నెలల సర్వీసులకు ఫీజు చెల్లించడం ద్వారా మొత్తం 40 నెలల సర్వీసులకు ఇంటర్నెట్‌ను పొందనున్నారు.

అయితే 24 నెలలు లేదా రెండు సంవత్సరాలు చెల్లించాలనుకునే వినియోగదారుల కోసం మరొక ఆఫర్‌ను కూడా అమలు చేస్తోంది. అటువంటి కస్టమర్ల కోసం స్టేట్-బ్యాక్డ్ కంపెనీ మూడు నెలల ఉచిత సేవలను అందిస్తుంది.

అంతేకాకుండా ప్రమోషనల్ ఆఫర్‌లో భాగంగా ఒక సంవత్సరం బీఎస్‌ఎన్‌ఎల్ సేవలకు చెల్లించే కస్టమర్‌లు ఒక నెల ఉచిత సేవలను అందుకుంటారు. మొత్తంమీద బీఎస్‌ఎన్‌ఎల్ ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం ప్రొవైడర్ సేవలను ఉపయోగించాలని యోచిస్తున్న వినియోగదారులకు అనేక ప్రయోజనాలు దక్కనున్నాయి. ప్రస్తుతం బీఎస్‌ఎన్‌ఎల్ రూ .449 ప్లాన్, రూ .779 ప్లాన్, రూ .999, రూ .1499 ప్లాన్ వరకు అనేక బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లను అందిస్తోంది.

Also Read: Worst Passwords: ఈ పాస్ వర్డ్స్ పెట్టుకున్నా ఒకటే.. పెట్టుకోకున్నా ఒక్కటే.. మీవి కూడా ఉన్నాయేమో చెక్ చేసుకోండి..

Income Tax: కొడుకు, కూతుళ్లకు ఆస్తిని బహుమతిగా ఇవ్వొచ్చా.. ఇస్తే పన్ను చెల్లించాలా.. చట్టం ఏం చెబుతుంది..

IRCTC: చార్ట్ సిద్ధం కాకముందే మీరు టిక్కెట్‌ని రద్దు చేసుకుంటున్నారా.. ఎంత డబ్బు కోల్పోతారో తెలుసా..