Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Income Tax: కొడుకు, కూతుళ్లకు ఆస్తిని బహుమతిగా ఇవ్వొచ్చా.. ఇస్తే పన్ను చెల్లించాలా.. చట్టం ఏం చెబుతుంది..

సాధారణంగా ఆస్తులు గురించి మాట్లాడుకునేటప్పుడు కూతుర్లు, కొడుకులకు సమాన హక్కులుంటాయని చెబుతుంటాం. తాత, ముత్తాతల ఆస్తిలో ఇద్దరికీ హక్కు ఉంటుంది. మరి తండ్రి ఆస్తిలో ఎవరికి హక్కు ఉంటుంది..

Income Tax: కొడుకు, కూతుళ్లకు ఆస్తిని బహుమతిగా ఇవ్వొచ్చా.. ఇస్తే పన్ను చెల్లించాలా.. చట్టం ఏం చెబుతుంది..
Income Tax Returns
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Oct 16, 2021 | 7:02 PM

సాధారణంగా ఆస్తులు గురించి మాట్లాడుకునేటప్పుడు కూతుర్లు, కొడుకులకు సమాన హక్కులుంటాయని చెబుతుంటాం. తాత, ముత్తాతల ఆస్తిలో ఇద్దరికీ హక్కు ఉంటుంది. మరి తండ్రి ఆస్తిలో ఎవరికి హక్కు ఉంటుంది. దీని గురించి చాలా మందికి తెలియదు. తండ్రి సంపాందించే ఆస్తి స్వార్జితం అంటారు. తాత, ముత్తాల నుంచి వచ్చే ఆస్తిని పిత్రార్జితం అంటారు. పిత్రార్జితంపై కూమర్తె, కుమారులకు హక్కు ఉంటుందని ఇప్పిటికే తెలుసున్నాం. తండ్రి ఆస్తిలో కూతురు, కొడక్కు హక్కులు ఉంటాయా అంటే.. ఆలోచించాల్సిందే.. ఎందుకంటే తండ్రి తాను స్వయంగా సంపాందించిన ఆస్తిని ఎవరికైనా ఇచ్చే హక్కు ఉంది. లా ప్రకారం నాన్న సంపాందించిన ఆస్తిని ఆయన ఇష్టమున్నట్లు దానం చేయొచ్చు.

దీనిపై కుమారుడు, కుమార్తె కోర్టు వెళ్లాడనికి అవకాశం ఉండదు. తండ్రి తన కొడుకుకు లేదా కూతురుకు ఆస్తినంతా బహుమతి రూపంలో ఇవ్వాలనుకుంటే ఇవ్వొచ్చు. ఇప్పుడున్న పన్ను చట్టాల ప్రకారం తండ్రి కొడుక్కే కాదు ఎవరికైనా బహుమతి రూపంలో తన స్వార్జిత ఆస్తిని ఇవ్వొచ్చు. దీనికి ఎలాంటి పరిమితి లేదు. బహుమతి ఇచ్చే సమయంలో పన్ను చెల్లింపులు ఉంటాయి. కానీ వాటికి పరిమితులు ఉంటాయి. భారతీయ పన్ను చట్టాల ప్రకారం ఒక వ్యక్తి ఒక సంవత్సర కాలంలో తీసుకున్న బహుమతుల విలువ రూ.50 వేలకు పైగా ఉంటే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అంతకంటే తక్కువ ఉంటే పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. బహుమతి గ్రహీత పన్ను చెల్లింపులకు సంబంధించి కొన్ని మినహాయింపులు ఉన్నాయి.

నిర్దిష్టమైన బంధువుల నుంచి అందుకున్న బహుమతులకు సంబంధించి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. తండ్రి కొడుకు లేదా కూతురు బహుమతి ఇస్తే పన్ను చెల్లించనవసరం లేదు. ఇక్కడు ఆస్తి బహుమతి అంటే స్థిరాస్తే కాదు డబ్బులు కూడా ఉంటాయి. ప్రస్తుతమున్న పన్ను నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి రూ.2 లక్షలకు మించి ఏదైనా బహుమతిని నగదు రూపంలో స్వీకరించరాదు. ఒకవేళ రూ.2 లక్షలకు పైగా డబ్బు తీసుకుంటే దానికి పన్ను కట్టాల్సి ఉంటుంది.

Read Also.. Safe Banking Tips: మీ బ్యాంక్ ఖాతాలో డబ్బుల దొంగిలించేందుకు ఇలా అడుగుతారు.. ఆశపడితే ఇక అంతే..