Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Worst Passwords: ఈ పాస్ వర్డ్స్ పెట్టుకున్నా ఒకటే.. పెట్టుకోకున్నా ఒక్కటే.. మీవి కూడా ఉన్నాయేమో చెక్ చేసుకోండి..

ఆఫీసు, ఇతర కంపెనీ సాఫ్ట్‌వేర్ వినియోగదారులు ఇప్పుడు పాస్‌వర్డ్ లేకుండా లాగిన్ కావొచ్చని మైక్రోసాఫ్ట్ గత నెలలో ప్రకటించింది. ఆన్‌లైన్ భద్రతకి సంబంధించి యూజర్స్‌కి మెరుగైన సేవలందించడం కోసం మైక్రోసాఫ్ట్ కీలక నిర్ణయం తీసుకుంది....

Worst Passwords: ఈ పాస్ వర్డ్స్ పెట్టుకున్నా ఒకటే.. పెట్టుకోకున్నా ఒక్కటే.. మీవి కూడా ఉన్నాయేమో చెక్ చేసుకోండి..
Pws
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Oct 16, 2021 | 9:00 PM

ఆఫీసు, ఇతర కంపెనీ సాఫ్ట్‌వేర్ వినియోగదారులు ఇప్పుడు పాస్‌వర్డ్ లేకుండా లాగిన్ కావొచ్చని మైక్రోసాఫ్ట్ గత నెలలో ప్రకటించింది. ఆన్‌లైన్ భద్రతకి సంబంధించి యూజర్స్‌కి మెరుగైన సేవలందించడం కోసం మైక్రోసాఫ్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. “చాలా మంది సులవైన పాస్‌వర్డ్ పెట్టుకుంటారు. కొందరు ఒకే పాస్‌వర్డ్ అన్నింటికి ఉపయోగిస్తారు. దీంతో కొన్ని సందర్భల్లో పాస్‌వర్డ్ హ్యాక్ చేసే అవకాశం ఉంటుంది” అని చెప్పింది. 53 శాతం మంది అనేక ఖాతాలకు ఒకే పాస్‌వర్డ్ ఉపయోగిస్తారని సెక్యూర్ అథ్ నివేదికలో తేలింది. ఎక్కువగా “123456”, “password”, “12345678” పాస్‌వర్డ్ ఉపయోగిస్తున్నట్లు తెలిసింది. వీటిని హ్యాక్ చేయడం సులభం.

ఆధునిక అప్లికేషన్‌ల కోసం యూజర్ మేనేజ్‌మెంట్ ప్లాట్‌ఫామ్ తయారీదారు అయిన ఫ్రంటెగ్ సహ వ్యవస్థాపకుడు మరియు సీటీఓ ఏవియాడ్ మిజ్రాచి, మీ అప్లికేషన్‌లలో మీరు ఎంత ఎక్కువ భద్రతను పెంపొందిస్తారో, వినియోగదారు అనుభవం అంత దారుణంగా ఉంటుందని తెలిపారు. పూర్ పాస్‌వర్డ్ పెట్టుకున్న వారు హ్యాకర్స్ టార్గెట్ అవుతారన్నారు. గుర్తుండడం కోసం సులువైన పాస్‌వర్డ్ పెట్టుకుంటారని చెప్పారు. పాస్‌వర్డ్ లేకుండా వెళ్లడానికి 64% మంది వినియోగదారుల అనుభవమే ప్రధాన కారణమని మైక్రో సాఫ్ట్ తన నివేదికలో పేర్కొంది. 73% మంది మంది మొదటి పాస్‌వర్డ్ లేని మల్టీ-ఫ్యాక్టర్ అథంటికేషన్ (MFA) పరిష్కారానికి పాస్‌వర్డ్‌లు, పుష్-ఆధారిత సాంప్రదాయ కారకాల కంటే ప్రాధాన్యతనిచ్చారు. పాస్‌వర్డ్ లేని MFA ని ఉపయోగించే సంస్థలకు మొబైల్ ఫోన్‎కు పంపిన కోడ్ అవరసమవుతుంది. అది యాక్సెస్ పొందడానికి కంప్యూటర్‌లోకి ఇన్‌పుట్ చేయాలి. సైబర్‌ సెక్యూరిటీ ఇన్‌సైడర్ సర్వేలో 61% మంది తమ ‘పాస్‌వర్డ్‌లెస్’ MFA పరిష్కారానికి షేర్డ్ సీక్రెట్, వన్-టైమ్ పాస్‌వర్డ్ లేదా SMS కోడ్ అవసరమని చెప్పారని నివేదికలో తెలిపింది.

“భవిష్యత్తు పాస్‌వర్డ్ లేనిదని స్పష్టమవుతుంది. మరిన్ని సేవలు, ప్లాట్‌ఫారమ్‌లు డిజిటలైజ్ చేయబడుతున్నందున, పాస్‌వర్డ్ ప్రామాణీకరణ మోడల్ ఇకపై ఆచరణాత్మకమైనది కాదు. పాస్‌వర్డ్ లేని ధోరణిని స్వీకరించడం, స్వీయ-సేవ, డిఫాల్ట్ ఎంపికగా అమలు చేయడం (యూజర్ మేనేజ్‌మెంట్ అనుకోండి) ఇకపై ఎంపిక కాదు” మిజ్రాచీ అన్నారు. ”FIDO అలయన్స్ ప్రకారం ఫేషియల్ రికగ్నిషన్, వాయిస్, ఫింగర్ ప్రింట్, సెక్యూరిటీ కీలతో సహా అనేక పాస్‌వర్డ్ లేని పరిష్కారాలు మార్కెట్‌కి వస్తున్నాయి. వాస్తవానికి, సైబర్‌ సెక్యూరిటీ ఇన్‌సైడర్స్ అధ్యయనానికి ప్రతిస్పందించిన వారిలో, 36% మంది తమ స్మార్ట్‌ఫోన్‌లను పాస్‌వర్డ్ లేని ధృవీకరణ కోసం FIDO టోకెన్‌గా ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. 73% మంది స్మార్ట్‌ఫోన్‌లు MFA యొక్క అత్యంత అనుకూలమైన పద్ధతిని అందిస్తాయని, 17% మంది టచ్ఐడీ, విండో హాల్లో వంటి అంతర్నిర్మిత ప్రమాణీకరణలు అత్యంత సౌకర్యవంతంగా ఉన్నాయని చెప్పారు.

మైక్రోసాఫ్ట్ అథెంటికేటర్ యాప్‌ ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత యూజర్స్ తమ ఖాతాలను పాస్‌వర్డ్‌లెస్‌కి మార్చుకోవచ్చు. ముందుగా మీ ఖాతాని అథెంటికేటర్‌ యాప్‌తో అనుసంధానించాలి. తర్వాత మీ మైక్రోసాఫ్ట్ ఖాతా సెట్టింగ్స్‌లోకి వెళ్లి అడ్వాన్స్‌డ్‌ సెక్యూరిటీలో పాస్‌వర్డ్‌లెస్‌ ఆప్షన్‌ని ఎనేబుల్ చేయాలి. తర్వాత అథెంటీకేటర్‌ యాప్‌లో వచ్చే నోటిఫికేషన్లను ఓకే చేస్తూ మీ ఖాతాలోకి లాగిన్ కావచ్చు. ఒకవేళ మీరు తిరిగి పాస్‌వర్డ్‌ కావాలనుకుంటే ఖాతా సెట్టింగ్స్‌లోకి వెళ్లి పాస్‌వర్డ్‌లెస్‌ ఆప్షన్‌ని డిసేబుల్ చేస్తే సరిపోతుంది. అయితే పాస్‌వర్డ్‌తో కంటే పాస్‌వర్డ్‌లెస్‌తోనే ఆన్‌లైన్ ఖాతాలకు ఎక్కువ భద్రత ఉంటుందని సైబర్‌ సెక్యూరిటీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Read Also.. MI New Smart Watch Video: మరో కొత్త స్మార్ట్‌ వాచ్‌ను లాంచ్‌ చేసిన MI సంస్థ.. అదిరిపోయే ఫీచర్స్..(వీడియో)