Axar Patel: అశ్విన్, జడేజాలకే ఝలక్.. అత్యంత వేగంగా ఆ ఫీట్ అందుకున్న అక్షర్..
ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టు చివరి రోజు.. ఆసీస్ బౌలర్ ట్రావిస్ హెడ్ వికెట్ పడగొట్టిన అక్షర్ పటేల్ రెండు రికార్డులను నమోదు చేశాడు. అదేలా అంటే..
అహ్మదాబాద్ వేదికగా జరిగిన నాలుగో టెస్టు డ్రాగా ముగిసినప్పటికీ.. ఆ మ్యాచ్‌లో పలు రికార్డులు నమోదయ్యాయి. భారత్ తరఫున, ప్రపంచ క్రికెట్‌లో 75 సెంచరీలు చేసిన రెండో క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించగా.. అక్షర్ పటేల్ కూడా తనదైన శైలిలో రికార్డులు నమోదు చేసుకున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన నాలుగో టెస్టు చివరి వరకు సాగి.. ఫలితం తేలకుండానే డ్రాగా ముగిసింది. దీంతో సీరిస్ 2-1 తేడాతో భారత్ సొంతమైంది. అయితే ఈ క్రమంలో చివరి రోజు ఆసీస్ బౌలర్ ట్రావిస్ హెడ్ వికెట్ పడగొట్టిన అక్షర్ పటేల్ రెండు రికార్డులను నమోదు చేశాడు. అదేలా అంటే.. టెస్టుల్లో అరంగేట్రం చేసినప్పటి నుంచి బంతితో పాటు బ్యాట్‌తోనూ అద్భుతంగా రాణిస్తున్నాడు అక్షర్ పటేల్.
అయితే ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ టెస్టు సిరీస్‌లో అక్షర్ బౌలింగ్‌లో రాణించలేకపోయినా, బ్యాటింగ్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు. కానీ అహ్మదాబాద్ టెస్టు ఐదో రోజు ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ వికెట్ తీసిన అక్షర్ పటేల్.. భారత్ తరఫున టెస్టు క్రికెట్‌లో అతి తక్కువ బంతుల్లో 5 వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ ఘనత కోసం అక్షర్ పటేల్ కేవలం 2205 బంతుల్లో యాభై వికెట్లు పూర్తి చేశాడు. టెస్టు అల్‌రౌండర్ ర్యాంక్‌లలో అక్షర్ కంటే ముందున్న రవిచంద్రన్ అశ్విన్, జడేజాలకు కూడా సాధ్యం కాని ఘనతను అతను సాధించడం గమనార్హం. వాస్తవానికి ఈ 50వ వికెట్ అక్షర్‌కు చిరస్మరణీయంగా మిగిలిపోతుంది. ఎందుకంటే 50 వికెట్ల రూపంలో అక్షర్ చేతిలో పడిన ట్రావిస్ హెడ్ కేవలం 10 పరుగుల తేడాతో తన సెంచరీకి దూరమయ్యాడు. ట్రావిస్ హెడ్ 90 పరుగుల వద్ద అక్షర్ బౌలింగ్‌లో అవుట్ అవడం ద్వారా భారత్‌పై తన టెస్టు సెంచరీని కోల్పోయాడు.
Milestone ? – Congratulations @akshar2026 who is now the fastest Indian bowler to take 50 wickets in terms of balls bowled (2205).
Travis Head is his 50th Test victim.#INDvAUS #TeamIndia pic.twitter.com/yAwGwVYmbo
— BCCI (@BCCI) March 13, 2023
మరోవైపు అత్యంత వేగంగా 50 వికెట్లు పూర్తి చేసి ఈ ఘనత సాధించిన ప్రపంచంలో 5వ ఆల్‌రౌండర్‌గా కూడా అక్షర్ నిలిచాడు. అలాగే టీమిండియా తరఫున కేవలం 12 టెస్టుల్లోనే 50 వికెట్లు, 500 పరుగుల మార్క్‌ను దాటిన రెండో ఆటగాడిగా అక్షర్ రికార్డు సృష్టించాడు. అక్షర్ కంటే ముందు ఈ ఫీట్‌ను టీమిండియా ఆల్‌రౌండర్ అశ్విన్ సాధించాడు. ప్రస్తుత బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో అక్షర్ పటేల్ తన బ్యాట్‌లో 3 అర్ధసెంచరీలతో 264 పరుగులు చేశాడు. అతని సగటు కూడా 88 ఉండడం విశేషం.
మరిన్ని క్రీడా వార్తల కోసం