IND Vs AUS: టీమిండియాను గెలిపించిన కేన్ మామ.. మనోడి ఇన్నింగ్స్‌కు ఫ్యాన్ అవ్వాల్సిందే..
టీమిండియాను ఏంటి.? కేన్ మామ గెలిపించడం ఏంటి.? అని ఆలోచిస్తున్నారా..! వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్స్‌లోకి..

టీమిండియాను ఏంటి.? కేన్ మామ గెలిపించడం ఏంటి.? అని ఆలోచిస్తున్నారా..! వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్స్‌లోకి టీమిండియా చేరాలంటే.. అహ్మదాబాద్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్ట్ తప్పక గెలవాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో భారత్ ఓడినా.. లేదా డ్రా చేసినా.. డబ్ల్యూటీసీ ఫైనల్స్‌లోకి చేరడానికి న్యూజిలాండ్-శ్రీలంక సిరీస్ ఫలితంపై ఆధారపడాల్సి ఉంది.
ఇదిలా ఉంటే.. న్యూజిలాండ్-శ్రీలంక మధ్య జరుగుతోన్న మొదటి టెస్టులో విజయం రెండు జట్ల మధ్య దోబూచులాడింది. ఈ మ్యాచ్‌లో శ్రీలంకపై న్యూజిలాండ్ గెలిస్తేనే.. భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్స్‌లోకి అడుగుపెడుతుంది. ఈ సిరీస్‌లో ఒక్క మ్యాచ్ శ్రీలంక గెలిచినా.. ఫలితం తారుమారు అవుతుంది. ఇలాంటి సమయంలో రెండో ఇన్నింగ్స్‌లో 285 పరుగుల టార్గెట్‌తో కివీస్ బ్యాటింగ్‌కు దిగింది.
ఒకదశలో ఓటమి అంచుకు వెళ్లిన న్యూజిలాండ్‌ను.. ఆ జట్టు మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్(121*) అజేయ శతకంతో ఆదుకున్నాడు. చివరి వరకు నిలిచి కివీస్‌కు అద్భుత విజయాన్ని అందించాడు. లాస్ట్ బాల్‌లో సూపర్ డైవ్ చేసి తన జట్టుకు గ్రాండ్ విక్టరీతో పాటు టీమిండియాను కూడా గెలిపించాడు. తద్వారా డబ్ల్యూటీసీ ఫైనల్స్‌లోకి టీమిండియాను చేర్చాడు. కేన్ మామ క్రేజీ ఇన్నింగ్స్‌తో భారత అభిమానులు అతడికి సోషల్ మీడియా వేదికగా థ్యాంక్స్ చెబుతున్నారు.




