IPL 2023: ఐపీఎల్ నుంచి శ్రేయాస్ అయ్యర్ ఔట్? కేకేఆర్ కెప్టెన్సీ రేసులో ముగ్గురు.. లిస్టులో ఇద్దరు దిగ్గజాలు..
Shreyas Iyer: ఐపీఎల్‌కు ముందు కోల్‌కతా నైట్ రైడర్స్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగలవచ్చు. జట్టు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ గాయం కారణంగా IPL నుంచి దూరంగా ఉండవచ్చని తెలుస్తోంది.
IPL 2023 మార్చి 31 నుంచి ప్రారంభమవుతుంది. కానీ, అంతకు ముందు కోల్‌కతా నైట్ రైడర్స్ పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. అహ్మదాబాద్‌లో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ చివరి టెస్టులో షారుఖ్ ఖాన్ జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ గాయపడ్డాడు. ఈ గాయం కారణంగా అతను ఆ మ్యాచ్‌లో బ్యాటింగ్‌కు కూడా రాలేకపోయాడు. ఇటువంటి పరిస్థితిలో అయ్యార్ గాయం కారణంగా ఐపీఎల్ 16 వ సీజన్ నుంచి తప్పుకోవచ్చనే ప్రచారం సాగుతోంది.
ఇటువంటి పరిస్థితిలో కేకేఆర్ జట్టు బాధ్యతలు చేపట్టగల ముగ్గురు ఆటగాళ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఆండ్రీ రస్సెల్..
వెస్టిండీస్ వెటరన్, తుఫాన్ బ్యాట్స్‌మెన్ ఆండ్రీ రస్సెల్ కేకేఆర్ అత్యంత అనుభవజ్ఞులైన ఆటగాళ్ళలో ఒకరు. చాలా సందర్భాలలో ఒంటరిగా జట్టును గెలిపించాడు. రస్సెల్ బ్యాట్‌తో పాటు బంతితో మ్యాజిక్ చేస్తాడు. దీంతో అయ్యర్ లేకపోవడంతో కోల్‌కతా నైట్ రైడర్స్ రస్సెల్‌ను కెప్టెన్‌గా చేయవచ్చని తెలుస్తోంది.
టిమ్ సౌతీ..
న్యూజిలాండ్‌కు చెందిన అనుభవజ్ఞుడైన ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌథీ కూడా కేకేఆర్‌కి కెప్టెన్‌గా వ్యవహరించడం చూడొచ్చు. సౌదీ అనేక సందర్భాల్లో కివీ జట్టుకు నాయకత్వం వహించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో ప్రస్తుతం న్యూజిలాండ్ టెస్టు జట్టుకు కెప్టెన్‌గా కూడా ఉన్నాడు. ఇటువంటి పరిస్థితిలో కోల్‌కత్తా అతని కెప్టెన్సీ అనుభవం నుంచి ప్రయోజనం పొందవచ్చని తెలుస్తోంది. అయ్యర్ స్థానంలో ఫ్రాంచైజీ అతన్ని కెప్టెన్‌గా చేయవచ్చు.
నితీష్ రాణా..
నితీష్ రాణా కూడా చాలా కాలంగా కేకేఆర్ తరపున ఐపీఎల్‌లో ఆడుతున్నాడు. దేశవాళీ క్రికెట్‌లో జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. అదే సమయంలో కేకేఆర్‌తో చాలా కాలంగా ఉన్న అనుబంధం కారణంగా జట్టుపై కూడా అతనికి మంచి అవగాహన ఉంది. ఇటువంటి పరిస్థితిలో అయ్యర్ గాయం కారణంగా IPL నుంచి తప్పుకుంటే, నితీష్ రాణా కూడా కేకేఆర్ కెప్టెన్‌గా మారొచ్చు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..