Viral Video: ఎంత మంచి మనసో.. ఆకలి తీర్చి ముఖంపై చిరునవ్వులు పూయించిన పాక్ మహిళ..

మన చుట్టు ఉండేవారిని ఓ సారి గమనిస్తే కొందరు విచారంగా, ముభావంగా ఉంటారు. వారి జీవితంలోని విషాదాన్ని తొలగించలేకపోయినా.. వారిని పలకరించి వారి ముఖంలో తాత్కాలికంగానైనా ఆనందం నింపితే అంతకు మించిన..

Viral Video: ఎంత మంచి మనసో.. ఆకలి తీర్చి ముఖంపై చిరునవ్వులు పూయించిన పాక్ మహిళ..
Viral Video
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 14, 2023 | 8:06 PM

మన చుట్టు ఉండేవారిని ఓ సారి గమనిస్తే కొందరు విచారంగా, ముభావంగా ఉంటారు. వారి జీవితంలోని విషాదాన్ని తొలగించలేకపోయినా.. వారిని పలకరించి వారి ముఖంలో తాత్కాలికంగానైనా ఆనందం నింపితే అంతకు మించిన సోషల్‌ సర్వీస్‌ వేరొకటి ఉండదు. అచ్చం అలాంటి సంఘటన ఒకటి పాకిస్తాన్‌లో చోటుచేసుకుంది. పాక్‌లో ఆర్థిక సంక్షోభం కారణంగా గడ్డు పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఆ దేశంలో ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. ఆకలితో ఉన్న వారికి పట్టెడన్నం పెడితే వారి మనసంతా కృతజ్ఞతతో నిండిపోతుందనే నానుడి వినే ఉంటారు. ఐతే రోడ్డుపై విచారంగా కూర్చుని బెలూన్లు అమ్ముకునే ఓ వికలాంగ బాలుడి ముఖంలో అటుగా కారులో వెళ్తున్న యువతి నవ్వులు పూయించిన విధానం ప్రతిఒక్కరినీ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైలర్‌ అవుతోంది. ఇంతకీ ఈ వీడియోలో ఏముందంటే..

రోడ్డుపై బెలూన్లు అమ్ముకుంటూ దిగులుగా కూర్చున్న క్రిష్‌ అనే వికలాంగుడైన బాలుడికి దగ్గరగా కారు వచ్చి ఆగడం వీడియోలో కనిపిస్తుంది. కారులో నుంచి ఓ యువతి బిర్యానీ ప్యాకెట్‌ ఇస్తుంది. ఆ ప్యాకెట్‌తోపాటు బిస్కెట్‌ ప్యాకెట్‌, కొన్ని చాక్లెట్లు క్రిష్‌కి ఇస్తుంది. అవన్నీ ఓ కవర్లో ప్యాక్‌ చేస్తూ బాలుడి పేరు, బెలూన్ల ధర అడిగి తెలుసుకుంటుంది. అనంతరం ఆమెకు అవసరం లేకపోయినా క్రిష్‌ దగ్గరున్న బెలూన్లన్నీ కొనుగోలు చేసి ఫుడ్‌ ప్యాకెట్‌తోపాటు కొంత డబ్బు కూడా ఇస్తుంది. వీటన్నింటి చూసిన తర్వాత క్రిష్‌ ఆనందంతో గెంతులు వేయడం ఈ వీడియోలో చూడొచ్చు. కృతజ్ఞతతో క్రిష్‌ తన చేతితో యువతి బుగ్గలు తాకి ఫ్రైయింగ్‌ కిస్‌ కూడా ఇస్తాడు. ఆకలితో ఎంతో విచారంగా కూర్చున్న బాలుడి ముఖంలో ఆనందం వెల్లివిరిసేలా చేసిన సదరు యువతి చర్యను నెటిజన్లు తెగ పొగిడేస్తున్నారు. నిజానికి ఈ వీడియోలోని యువతి పేరు ఫైజా నయీమ్‌. ఆమె పాకిస్థాన్‌లో కౌన్సెలర్, హిప్నాటిస్ట్, సోషల్‌ యాక్టివిస్ట్‌, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్‌గా పనిచేస్తున్నారు. ‘బెస్ట్‌ మూమెంట్‌ ఆఫ్‌ మై లైఫ్‌’ అనే క్యాప్షన్‌తో ఫైజా నయీమ్ తన ఇన్‌స్టా ఖాతాలో పోస్టు చేసిన ఈ వీడియోకు 12 మిలియన్లకుపైగా వీక్షణలు, లక్షల్లో కామెంట్లు వచ్చాయి.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Faiza Naeem (@naeem.faiza)

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.