AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TSPSC: ప్రశ్నాపత్రాలు లీక్ వ్యవహారంపై గవర్నర్‌ తమిళిసై సీరియస్‌.. 2 రోజుల్లో సమగ్ర నివేదికకు ఆదేశం

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే ఉద్యోగ నియామక పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు లీక్ ఆరోపణలను గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ తీవ్రంగా పరిగణించారు. ప్రశ్నాపత్రాల లీక్ వ్యవహారంపై..

TSPSC: ప్రశ్నాపత్రాలు లీక్ వ్యవహారంపై గవర్నర్‌ తమిళిసై సీరియస్‌.. 2 రోజుల్లో సమగ్ర నివేదికకు ఆదేశం
TSPSC Paper Leak
Srilakshmi C
|

Updated on: Mar 14, 2023 | 9:05 PM

Share

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే ఉద్యోగ నియామక పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు లీక్ ఆరోపణలను గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ తీవ్రంగా పరిగణించారు. ప్రశ్నాపత్రాల లీక్ వ్యవహారంపై, జరిపిన దర్యాప్తు పై, వెల్లడైన నిజాలపై సమగ్రమైన నివేదిక రెండు రోజుల్లో సమర్పించాలని టీఎస్పీఎస్సీని గవర్నర్ ఆదేశించారు. లక్షలాది మంది ఉద్యోగార్థుల జీవితాలకు సంబంధించిన అంశం అయినందున, ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా తీసుకుంటున్న చర్యలపై గవర్నర్ నివేదిక కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా, ఉద్యోగార్థులకు టీఏస్‌పీఎస్సీపై నమ్మకం కలిగించే విధంగా కఠిన చర్యలు తీసుకోవాలని తమిళిసై సూచించారు.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన టీఏస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తీవ్రంగా పరిగణించారు. గవర్నర్‌ ఆదేశాల మేరకు రాజ్ భవన్ మంగళవారం టీఏస్‌పీఎస్సీ కార్యదర్శికి లేఖ రాసింది. తన లేఖలో సమగ్ర విచారణకు ఆదేశించారు. లీకేజీపై వివరణాత్మక నివేదికను కోరారు. అసలైన అభ్యర్థుల భవిష్యత్తు, ప్రయోజనాలను కాపాడటానికి ఇటువంటి దురదృష్ట సంఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన దిద్దుబాటు చర్యలను తక్షణమే తీసుకోవాలని, బాధ్యులందరిపై పై కఠిన చర్యలు తీసుకోవాలని గవర్ననర్‌ తమిళిసై ఆదేశించారు. ఈ ఘటనపై 48 గంటల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని గవర్నర్ కార్యాలయం కోరింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.