AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గర్ల్స్‌ హాస్టల్‌లో విద్యార్థులపై ఎలుకల దాడి.. ఆవరణలో పాములు, కుక్కల స్వైరవిహారం.. పలువురికి గాయాలు

దేశానికి, ప్రపంచానికి ఎంతోమంది మేధావులను అందించిన వరంగల్‌ కాకతీయ యూనివర్సిటీ హాస్టల్స్‌ దుస్థితి అధ్వాన్నంగా మారింది.

గర్ల్స్‌ హాస్టల్‌లో విద్యార్థులపై ఎలుకల దాడి.. ఆవరణలో పాములు, కుక్కల స్వైరవిహారం.. పలువురికి గాయాలు
Rat
Jyothi Gadda
| Edited By: |

Updated on: Mar 15, 2023 | 2:37 PM

Share

దేశానికి, ప్రపంచానికి ఎంతోమంది మేధావులను అందించిన వరంగల్‌ కాకతీయ యూనివర్సిటీ హాస్టల్స్‌ దుస్థితి అధ్వాన్నంగా మారింది. ఎలుకలు ఏకంగా హాస్టల్ గదుల్లోకి ప్రవేశించి విద్యార్థులను కొరికి గాయాలపాలు చేస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం పద్మాక్షి గర్ల్స్ హాస్టల్ D బ్లాక్‌లో వెంటిలేటర్స్ నుంచి హాస్టల్ గదిలోకి ప్రవేశించిన ఎలుకలు ముగ్గురు విద్యార్థుల కాళ్ళు, చేతులు కొరికాయి. చెత్తాచెదారంతో పాటు ఆహార పదార్థాలు పోగవడంతో ఎలుకలు, తేళ్లు, పాములు హాస్టళ్ల ఆవరణలో తిష్ట వేశాయి. యూనివర్సిటీ క్యాంపస్‌లో పద్మాక్షి గర్ల్స్ హాస్టల్ తో పాటు,న్యూ పీజీ హాస్టల్, పోతన, గణపతిదేవా, అంబేద్కర్‌, జగ్ జీవన్ ఫార్మసీ హాస్టల్ తో కలిపి ఎనిమిది హాస్టళ్లు ఉన్నాయి.. ఇందులో మూడు వేల మందికి పైగా విద్యార్థులు ఉంటున్నారు. ఎలుకల బెడదతో ప్రశాంతంగా పడుకోలేకపోతున్నారు విద్యార్థులు

విషపు పురుగులు, కుక్కల బెడద కూడా ఉందని గర్ల్స్‌ హాస్టల్‌ విద్యార్థులు వాపోతున్నారు. బాయ్స్ హాస్టళ్లలో కూడా ఇదే దుస్థితి నెలకొంది. ఈ పరిస్థితులపై ఎన్నిసార్లు కంప్లయింట్‌ చేసినా వర్సిటీ అధికారులు పట్టించుకోవడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. విద్యార్థుల ప్రాణాలకు భద్రత కల్పించాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు. ఎలుకలు, విషపు పురుగుల స్వైర విహారంతో హాస్టల్‌ విద్యార్థుల బతుకు దినదినగండంలా మారింది. ప్రాణాలు పణంగా పెట్టి చదువుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.

చదువుకుందామని వచ్చినవాళ్లను ఎలుకలు కొరుకుతున్నాయి. రాత్రిళ్లు పాములు భయపెడుతున్నాయి. ఇక రాత్రీపగలు తేడా లేకుండా కుక్కలు హడలెత్తిస్తున్నాయి. దేశానికి, ప్రపంచానికి మేధావులను అందించిన ఓరుగల్లు కాకతీయ వర్సిటీ హాస్టళ్లలో ఇప్పుడు హాహాకారాలు వినిపిస్తున్నాయి.

ఫ్రెండ్‌ కోసం సూపర్‌‌ హిట్ కథ వదులుకున్న ప్రభాస్‌
ఫ్రెండ్‌ కోసం సూపర్‌‌ హిట్ కథ వదులుకున్న ప్రభాస్‌
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డ్.. ఆ తోపు టీంలకే సాధ్యంకాలే
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డ్.. ఆ తోపు టీంలకే సాధ్యంకాలే
సడెన్‌గా కాఫీ తాగడం మానేస్తే.. శరీరంలో జరిగే మార్పులేంటి? వాటికి
సడెన్‌గా కాఫీ తాగడం మానేస్తే.. శరీరంలో జరిగే మార్పులేంటి? వాటికి
పామును మరో పాము కరిస్తే ఏమవుతుంది..? అవి చనిపోతాయా లేక బతుకుతాయా
పామును మరో పాము కరిస్తే ఏమవుతుంది..? అవి చనిపోతాయా లేక బతుకుతాయా
ఎన్టీఆర్ పితృ సమానులుగా భావించింది ఆయన్నే...
ఎన్టీఆర్ పితృ సమానులుగా భావించింది ఆయన్నే...
అకాల మరణం పొందితే ఆ ఆత్మలు భూలోకంలోనే తిరుగుతాయా.. గరుడ పురాణం..
అకాల మరణం పొందితే ఆ ఆత్మలు భూలోకంలోనే తిరుగుతాయా.. గరుడ పురాణం..
ఒకప్పుడు బాత్రూమ్స్ కడిగాడు.. ఇప్పుడీ జబర్దస్త్ నటుడు కోటీశ్వరుడు
ఒకప్పుడు బాత్రూమ్స్ కడిగాడు.. ఇప్పుడీ జబర్దస్త్ నటుడు కోటీశ్వరుడు
శ్రీవారి సన్నిధిలో ఫోటో షూట్.. క్షమాపణ చెప్పిన కొత్తజంట
శ్రీవారి సన్నిధిలో ఫోటో షూట్.. క్షమాపణ చెప్పిన కొత్తజంట
చికెన్ 65 కి అసలు ఆ పేరెలా వచ్చిందో తెలుసా?
చికెన్ 65 కి అసలు ఆ పేరెలా వచ్చిందో తెలుసా?
నుమాయిష్‌లో వంటల పోటీలు.. మీ చేతి రుచి చూపేందుకు సిద్దమా?
నుమాయిష్‌లో వంటల పోటీలు.. మీ చేతి రుచి చూపేందుకు సిద్దమా?