Vijay Deverakonda: టీవీ9 గ్లోబల్ సమ్మిట్‌లో స్టార్ హీరో విజయ్ దేవరకొండ ఆసక్తికర కామెంట్స్..
WITT గ్లోబల్ సమ్మిట్ 2025: టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ TV9 గ్రూప్ WITT గ్లోబల్ సమ్మిట్ మూడవ ఎడిషన్‌కు హాజరయ్యారు. ఈ సమయంలో ఆయన దక్షిణాది, నార్త్ ఇండస్ట్రీల గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అలాగే ఇదే వేదికపై కింగ్ డమ్ సినిమా టీజర్ మరోసారి రిలీజ్ చేశారు.

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం కింగ్ డమ్ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన టీజర్ మూవీపై మరిన్న అంచనాలను పెంచేసింది. ఇదిలా ఉంటే.. విజయ్ దేవరకొండ శుక్రవారం టీవీ9 నెట్‌వర్క్ వార్షిక కార్యక్రమం WITT గ్లోబల్ సమ్మిట్‌కు హాజరయ్యారు. వాట్ ఇండియా థింక్స్ టుడే కార్యక్రమం శుక్రవారం ప్రారంభం కాగా.. ఈ సందర్భంగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ TV9 గ్రూప్‌పై ప్రశంసలు కురిపించారు. అదే సమయంలో, వ్యాపార, రాజకీయ, వినోద రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టాలీవుడ ఇండస్ట్రీ నుంచి విజయ్ దేవరొండ పాల్గొన్నారు. తన ఫిల్మ్ కెరీర్, టాలీవుడ్ మూవీస్ గురించి అనేక విషయాలను పంచుకున్నారు. అలాగే తన నెక్ట్స్ మూవీ కింగ్ డమ్ టీజర్ ను TV9 ప్రత్యేక కార్యక్రమంలో ప్రమోట్ చేశారు.
సూపర్ స్టార్లతో కలిసి పనిచేయడం గురించి.. అది ఎంత సవాలుతో కూడుకున్నదో విజయ్ దేవరకొండను అడగ్గా.. ఆయన మాట్లాడుతూ.. “కింగ్ డమ్ సినిమాకు జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ మాత్రమే అవసరమని నాకు మొదటి నుంచీ తెలుసు. ఎందుకంటే తారక్ మాత్రమే దానికి న్యాయం చేయగలడు. నేను ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లి అడిగాను. నన్ను తన పక్కన కూర్చోబెట్టుకుని, ఈ సాయంత్రం చేద్దాం అన్నాడు. ఆ సినిమా దర్శకుడు కూడా అప్పుడు అక్కడ లేరు.. కానీ జూనియర్ ఎన్టీఆర్ అంతా బాగానే ఉంటుందని హామీ ఇచ్చి నాకు ఎంతో ప్రోత్సాహం అందించాడు. జూనియర్ ఎన్టీఆర్ చాలా ఉత్సాహంగా ఉన్నాడు. కింగ్ డమ్ సినిమా టీజర్ కు ఎంతో అద్భుతంగా డబ్బింగ్ చాలా చెప్పారు ” అని అన్నారు.
అలాగే రణ్‌బీర్ గురించి విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ” రణ్‌బీర్ కపూర్ నాకు ఇష్టమైన నటులలో ఒకరు. నేను ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. నేను రణ్‌బీర్‌కి మెసేజ్ చేశాను. ఆ పని ఏమిటో కూడా అతనికి చెప్పలేదు. కానీ అతనికి డబ్బింగ్ గురించి తెలుసు. నా సందేశం అందిన వెంటనే అతను సరే అన్నాడు. దీని తర్వాత నేను అతనికి ఫోన్ చేసి టీజర్ వివరాలను పంచుకున్నాను” అని అన్నారు.
ఇది చదవండి : Tollywood: చేసిన ఒక్క సినిమా డిజాస్టర్.. కట్ చేస్తే.. అమ్మడు జోరు ఇప్పట్లో ఆగేలా లేదుగా..
Ram Charan : రామ్ చరణ్ ఫేవరేట్ హీరోయిన్ ఎవరో తెలుసా.. ? పాన్ ఇండియా సెన్సేషన్.. కానీ ఇప్పుడు..
Actress Laya: హీరోయిన్ లయ కూతురిని చూశారా.. ? అప్పుడే సినిమాల్లోకి వచ్చేసిందిగా.. ఫోటోస్ చూస్తే..
Tollywood: తెలుగులో జోరు పెంచిన యంగ్ హీరోయిన్.. అమ్మడు ఇప్పట్లో ఆగేలే లేదుగా..




