- Telugu News Photo Gallery Viral photos Kitchen Tips in Telugu: Follow these tips to make your housework easier, quicker and better
Kitchen Tips: పెరుగు తోడు పెట్టేటప్పుడు పాలకు చిటికెడు పంచదార చేర్చారంటే..
ఇంటి పని, వంట పని తెమిలి పిల్లలను రెడీ చేసి స్కూల్‌కి పంపేసరికి గృహిణుల తల ప్రాణం తోకకు వస్తుంది. పనులు సులువుగా చేయడం కూడా ఓ కళ. ఈ టిప్స్ పాటించారంటే.. మీ ఇంటి పనులు క్షణాల్లో చక్కబెట్టుకోవచ్చు..
Updated on: Mar 15, 2023 | 5:48 PM

ఇంటి పని, వంట పని తెమిలి పిల్లలను రెడీ చేసి స్కూల్‌కి పంపేసరికి గృహిణుల తల ప్రాణం తోకకు వస్తుంది. పనులు సులువుగా చేయడం కూడా ఓ కళ. ఈ టిప్స్ పాటించారంటే.. మీ ఇంటి పనులు క్షణాల్లో చక్కబెట్టుకోవచ్చు..

దుస్తులకు ఉండే లేసులు మురికిగా ఉంటే.. మజ్జిగతో రుద్ది ఆ తర్వాత ఉతికి చూడండి తళతళ మెరుస్తాయి

ప్లాస్టిక్ వస్తువులకు అంటిన నూనె మరకలు వదలాలంటే వంటసోడాలో నీళ్లు కలిపి ఆ మిశ్రమంతో రుద్దితే ఇట్టే పోతాయి

చెత్తబుట్టలో బ్యాక్టీరియా చేరి దుర్వాసన రాకుండా ఉండాలంటే.. బుట్ట అడుగు భాగంలో కొంచెం బొరాక్స్ పొడి చల్లితే సరి

కొవ్వొత్తులను వెలిగించే ముందు వాటి పైభాగన కాస్త ఉప్పు రాస్తే ఎక్కువ సమయం వస్తాయి

బంగాళదుంపలు ఉడికించిన నీటిని చల్లార్చి గులాబీ మొక్కల వేళ్ల భాగంలో పోస్తే.. మొక్కలు బాగా ఎదుగుతాయి

అన్నం వండేటప్పుడు బియ్యంలో చిన్న ముక్క దాల్చిన చెక్క వేస్తే మధుమేహ వ్యాధి గ్రస్తులకు షుగర్ స్థాయిలు తగ్గించేందుకు దోహదపడుతుంది

పాలు తోడు పెట్టేటప్పుడు దానిలో చిటికెడు పంచదార వేస్తే పెరుగు త్వరగా పులుపెక్కదు.. రుచి కూడా బాగుంటుంది





























