- Telugu News Photo Gallery Tamil Nadu Fruit Vendor Has Been Gifting Books to Customers For a Decade, Here's full details
Fruit Vendor: తన దుకాణానికి వచ్చే కస్టమర్స్‌కు బహుమతులు ఇస్తున్న ఓనర్.. మరణానంతరం అవయవాలు సైతం..!
యువ తరంలో చదివే అలవాటును ప్రోత్సహించే ప్రయత్నంలో భాగంగా ఓ పండ్ల విక్రేత ఉచితంగా పుస్తకాలను అందిస్తున్నాడు. తమిళనాడులోని తంజావూరు జిల్లాలో 63 ఏళ్ల వ్యక్తి తన కస్టమర్లందరికీ పుస్తకాలను బహుమతిగా ఇస్తున్నాడు. ఈ షాప్ లో పండ్లు కొనుగోలు చేసే ప్రతి వ్యక్తి పుస్తకాన్ని గిఫ్ట్ గా అందుకుంటాడు.
Updated on: Mar 15, 2023 | 2:09 PM

యువ తరంలో చదివే అలవాటును ప్రోత్సహించే ప్రయత్నంలో భాగంగా ఓ పండ్ల విక్రేత ఉచితంగా పుస్తకాలను అందిస్తున్నాడు. తమిళనాడులోని తంజావూరు జిల్లాలో 63 ఏళ్ల వ్యక్తి తన కస్టమర్లందరికీ పుస్తకాలను బహుమతిగా ఇస్తున్నాడు. ఈ షాప్ లో పండ్లు కొనుగోలు చేసే ప్రతి వ్యక్తి పుస్తకాన్ని గిఫ్ట్ గా అందుకుంటాడు.

తంజావూరులోని పుక్కర వీధికి చెందిన ఖాజా మొయిదీన్ కొన్నేళ్లుగా తన ఇంటి ముందు పండ్ల దుకాణం నడుపుతున్నాడు. కమ్యూనిస్ట్ సిద్ధాంతాలకు ప్రేరణ పొందిన ఖాజా మొయిదీన్ ను స్థానికులు 'కామ్రేడ్' అని పిలుస్తారు. అతను తన దుకాణానికి కాజా మొయిదీన్ కామ్రేడ్ బెకడై అని పేరు పెట్టాడు. చాలా సంవత్సరాల నుంచి తన దుకాణంలో పండ్లు, జ్యూస్‌లు విక్రయిస్తున్నారు.

11 సంవత్సరాల క్రితం ఖాజా మొయిదీన్ కొడుకు మరణించాడు. తన మనస్సును ఆ దుఃఖం నుంచి మళ్లించడానికి తన షాప్ దగ్గరకు వచ్చే వ్యక్తులకు పుస్తకాలను పంచడం అలవాటు చేసుకున్నాడు. ఇప్పుడు ఖాజా మొయిదీన్‌కు ఇది సాధారణ సేవగా మారింది. తన షాపుకు వచ్చిన కస్టమర్లందరికీ ఉచితంగా పుస్తకాలు ఇస్తున్నాడు.

ఇదే విషయంపై ఖాజా మొయిదీన్ మాట్లాడుతూ.. పుస్తక పఠనాన్ని ప్రోత్సహించేందుకు అవగాహన కల్పించేందుకు రాజకీయ నేతల జీవిత చరిత్రలు, పిల్లల కథల పుస్తకాలు, తమిళ-ఇంగ్లీష్ నిఘంటువు పుస్తకాలను కూడా అందిస్తున్నానని చెప్పాడు.

తన ‘కుటుంబ పరిస్థితుల కారణంగా 9వ తరగతితో చదువు ఆపేశాను. అయినా పుస్తకాలు చదవడం మానలేదు. చిన్నతనంలో మా పుక్కర వీధిలో జరిగే క్రీడా పోటీల్లో పుస్తకాలు బహుమతులుగా ఇచ్చేవారు. ఆ అలవాటు నాకూ సోకిందని చెప్పారు.

పెళ్లయ్యాక తన భార్యను కూడా చదువుకోమని ప్రోత్సహించానని.. దీంతో డిగ్రీ చదివిన తన భార్య ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తుందని తెలిపాడు. అంతేకాదు తన కొడుకు న్యాయవాది. గత 11 సంవత్సరాలుగా తన దుకాణం దగ్గరకు పండ్లు , రసం తాగడానికి వచ్చే కస్టమర్స్ కు పుస్తకాలు గిఫ్ట్స్ ఇస్తున్నాని పేర్కొన్నాడు.

కస్టమర్‌లు తనను పండ్ల విక్రయదారుడిగా కాదు.. ఓ ఇంటి సభ్యునిగా చూస్తారంటూ చెప్పి సంతోషం వ్యక్తం చేశారు. తన మరణానంతరం తంజావూరు మెడికల్ కాలేజీకి శరీరం దానం చేశానని వెల్లడించాడు ఖాజా మొయిదీన్ . అయితే తనకు మనుషులే ముఖ్యం. డబ్బుతో సహా మిగతావన్నీ తాత్కాలికమే’’ అంటూ ఖాజా మొయిదీన్ భావోద్వేగానికి లోనయ్యారు.




