World Best Airport 2023: ప్రపంచంలోని అత్యుత్తమ విమానాశ్రయాలు ఏవో తెలుసా..?
World Best Airport 2023: స్కైట్రాక్స్ అనేది UKలో ఉన్న ఎయిర్‌లైన్, ఎయిర్‌పోర్ట్ రివ్యూ, ర్యాంకింగ్ సైట్. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రయాణికుల నుండి సర్వే నివేదికలను సేకరించి ఫలితాలను ప్రకటిస్తుంది.
Updated on: Mar 17, 2023 | 2:09 PM

Changi Airports- సింగపూర్‌లోని చాంగీ విమానాశ్రయం స్కైట్రాక్స్ ప్రపంచ అత్యుత్తమ విమానాశ్రయాల వార్షిక ర్యాంకింగ్‌లో మళ్లీ అగ్రస్థానంలో నిలిచింది.

Doha's Hamad International -దోహాలోని హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఈ ఏడాది స్కైట్రాక్స్ జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. ఈ విమానాశ్రయంలో వివిధ రకాల సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.

Tokyo International Airport- టోక్యోలోని హనేడా అంతర్జాతీయ విమానాశ్రయం 2023కి సంబంధించి స్కైట్రాక్స్‌లోని మొదటి ఐదు స్థానాల్లో మూడవ స్థానంలో నిలిచింది.

Incheon International Airpo- దక్షిణ కొరియాలోని ఇంచియాన్ అంతర్జాతీయ విమానాశ్రయం నాల్గవ ఉత్తమ విమానాశ్రయం టైటిల్‌ను పొందింది.

Paris Charles De Gaulle Air- ప్రపంచ ఫ్యాషన్ రాజధానిగా పేరొందిన పారిస్‌లోని చార్లెస్ డి గాల్ అంతర్జాతీయ విమానాశ్రయం ఐదో స్థానంలో నిలిచింది.




