Viral Video: మద్యం మత్తులో మహిళా ప్రయాణికురాలిన వేధించిన టీటీ.. సస్పెండ్ చేసిన అధికారులు

బెంగళూరులోని కృష్ణరాజపురం రైల్వే స్టేషన్‌కు సమీపంలో ఓ మహిళా ప్రయాణికురాలికి, టీటీకి మధ్య గొడవ జరిగింది. మంగళవారం ట్విట్టర్‌లో షేర్ చేసిన వీడియో గత 48 గంటల్లో వైరల్‌గా మారింది.

Viral Video: మద్యం మత్తులో మహిళా ప్రయాణికురాలిన వేధించిన టీటీ.. సస్పెండ్ చేసిన అధికారులు
Viral Video
Follow us
Surya Kala

|

Updated on: Mar 17, 2023 | 10:57 AM

సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్ ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చిన తర్వాత.. ఎక్కడ ఏ సంఘటన జరిగినా వెంటనే నెట్టింట్లో ప్రత్యక్షం అవుతుంది. ఇదెక్కడి న్యాయం అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. తాజాగా మద్యం మత్తులో ఓ ప్రయాణీకురాలిని వేధిస్తున్న టీటీకి చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ.. అది రైల్వే శాఖ అధికారుల దృష్టికి చేరుకుంది. దీంతో మత్తులో మహిళా ప్రయాణికురాలిని  వేధించినందుకు రైలు టికెట్ (టిటి) ఎగ్జామినర్‌ను సస్పెండ్ చేసింది. ఈ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

బెంగళూరులోని కృష్ణరాజపురం రైల్వే స్టేషన్‌కు సమీపంలో ఓ మహిళా ప్రయాణికురాలికి, టీటీకి మధ్య గొడవ జరిగింది. మంగళవారం ట్విట్టర్‌లో షేర్ చేసిన వీడియో గత 48 గంటల్లో వైరల్‌గా మారింది. టిటి ఒక మహిళా ప్రయాణీకురాలిని టిక్కెట్ చూపించమని అడిగాడు. టికెట్ బుక్ చేసుకున్నానని చెబుతుంటే.. ఆ టికెట్ కలెక్టర్ ఆ మహిళపై గట్టిగా అరిచాడు.. దీంతో ఆమె కన్నీరు పెట్టుకుంది. తోటి ప్రయాణీకులు వారిస్తున్నా టీటీ వినలేదు. అనుచితంగా ప్రవర్తించాడు. మద్యం మత్తులో ఆ అధికారి తనను కావాలనే వేధించాడని బాధితురాలు ఆరోపించింది.

ఇవి కూడా చదవండి

ఓ ప్రయాణికుడు ఆగ్రహం వ్యక్తం చేస్తూ..  మద్యం మత్తులో ఇలా ప్రవర్తించాడని ఆరోపించాడు. డ్యూటీలో ఉండగా మందు తాగడం ఏమిటి అంటూ ప్రశ్నించాడు. అయితే ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న రైల్వే శాఖ  అధికారులు వెంటనే ఆ టీటీని సస్పెండ్ చేశారు. విచారణకు ఆదేశించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..