Viral Video: హవ్వా.. దోసను ఇలా కూడా చేస్తారా? దోసను ఇష్టపడే వారు అస్సలు చూడొద్దు..
ఇప్పుడు ఓ కొత్త రకం దోస నెట్టింట వైరల్ అవుతోంది. దాని పేరు మట్కా దోస. చీజ్, మయోనైస్ ఉపయోగించి ఈ మట్కా దోసను తయారు చేయడాన్ని వైరల్ అవుతున్న ఆ వీడియోలో చూడవచ్చు. ప్రస్తుతం ఇదే ట్రెండింగ్..
మన తెలుగు రాష్ట్రల్లోనే కాదు దక్షిణభారతదేశంలోనే అల్పహారంలో దోసకు మంచి డిమాండ్ ఉంది. చాలా రకాల దోసలు మార్కెట్లో లభ్యమవుతాయి. అయితే దానిని సాంబార్, చట్నీతో తినడం, ఆ రుచిని ఆస్వాదించడం చేస్తుంటాం. కానీ ఇప్పుడు ఓ కొత్త రకం దోస నెట్టింట వైరల్ అవుతోంది. దాని పేరు మట్కా దోస. చీజ్, మయోనైస్ ఉపయోగించి ఈ మట్కా దోసను తయారు చేయడాన్ని వైరల్ అవుతున్న ఆ వీడియోలో చూడవచ్చు. ప్రస్తుతం ఇదే ట్రెండింగ్.. అంతలా ఈ దోసలో ఏముంది? దానిని ఎలా తయారు చేశాడు? ఎవరు పోస్ట్ చేశారు? తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ కథనం పూర్తిగా చదవండి..
కరోనా తర్వాత ఫుడ్ వ్లాగ్‌లు తరచుగా సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. అదనంగా, కొత్త ఆవిష్కరణలు అంటే విచిత్రమైన ఫ్యూజన్ ఫుడ్స్ కి నెట్టింట విపరీతమైన ఆదరణ లభిస్తోంది. అలాంటి వీడియోలకు లక్షల్లో వీక్షణలు వస్తున్నాయి. ఇదే కోవలోని ఓ వీడియో ఒకటి వైరల్‌గా మారింది. మీరు సాధారణంగా మట్కా టీ తాగి ఉంటారు. కానీ వైరల్ అవుతున్న వీడియోలోని వంటకం మట్కా దోస. ఇదిగో వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసేయండి..
#MatkaDosa. pic.twitter.com/Jg5K03uFzT
— Deepak Prabhu/दीपक प्रभु (@ragiing_bull) March 14, 2023
ఎవరు పోస్ట్ చేశారు..
మట్కా దోస వీడియోను దీపక్ ప్రభు అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేసి దానికి #MatkaDosa అని క్యాప్షన్ పెట్టారు. వీడియోలో, మట్కా దోసను చీజ్, మయోనైస్, సాస్‌తో తయారు చేశారు. వీడియోకు 68.6K కంటే ఎక్కువ వీక్షణలు, అనేక స్పందనలు వచ్చాయి. వీడియోలో జున్ను, మయోనైస్ కలిపి నోరూరించేలా ఉన్నా.. మట్కా ఎందుకు? అని చాలా మంది కామెంట్స్ చేశారు. జున్ను ఎక్కువగా ఉపయోగించడం ద్వారా సంప్రదాయ దోస రుచిని మారుస్తున్నారంటూ కొంతమంది మండిపడ్డారు.
మట్కా దోసను మీరు ఇలా ట్రై చేయొచ్చు..
మట్కా దోస మీరు చేయాలనుకుంటే ముందుగా క్యాప్సికమ్, పనీర్, టొమాటో సాస్, సోయా సాస్, మసాలా దినుసులను తీసుకోవాలి. దోసె పాన్‌పై పిండిని పోసి, దోసను వేసిన తర్వాత, కూరగాయలు, సాస్, జున్ను, మయోనెస్, మసాలాలు దోస పైన వేయాలి. ఆపై దానిని ఓ కుండలోకి తీసుకోవాలి. దోసపై దానిపై చీజ్ తురిమి.. కొత్తిమీర, మయోనైస్ వేసి మట్కాపై ఉంచి దోసను కోన్ ఆకారంలో తయారు చేసి కుండపై పెడతారు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..