Viral News: మద్యం సేవించి పెళ్లి ముహర్తం మరచిపోయిన పెళ్లి కొడుకు.. మర్నాడు పెళ్లి మండపానికి వెళ్తే వధువు షాక్..

పెళ్లి పీటలపై వరుడికోసం వధువు నిరీక్షిస్తోంది. ముహూర్తం దాటినా వరుడి జాడలేదు. దాంతో వధువు కుటుంబీకులు ఆందోళన చెందారు. పదేపదే ఫోన్ చేసినప్పటికీ వరుడు వైపు నుండి ఎటువంటి స్పందన లేదు.

Viral News: మద్యం సేవించి పెళ్లి ముహర్తం మరచిపోయిన పెళ్లి కొడుకు.. మర్నాడు పెళ్లి మండపానికి వెళ్తే వధువు షాక్..
Drunk Groom
Follow us
Surya Kala

|

Updated on: Mar 17, 2023 | 9:01 AM

ప్రతి వ్యక్తి జీవితంలోనూ వివాహం అనేది మధురమైన ఘట్టం. ప్రతి ఒక్కరి జీవితంలో కీలకమైన టర్నింగ్‌ పాయింట్‌ వివాహం. అలాంటి వివాహానికి రాను రాను సంస్కృతి సంప్రదాయాలకు చోటిస్తూనే ఆధునికతను జోడించి మరింత అందంగా మలచుకుంటున్నారు. మరికొందరు మాత్రం మద్యం మహమ్మారికి బానిసై జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తాజాగా ఓ యువకుడు మద్యం మత్తులో తన పెళ్లి ముహూర్తసమయాన్నే మర్చిపోయాడు. వేదికపై పెళ్లి కూతురు వరుడి కోసం ఎదురుచూస్తుంటే వరుడు మాత్రం మందుకొడుతూ ఎంజాయ్‌ చేస్తూ ఉండిపోయాడు.

బిహార్‌ భాగల్‌పూర్‌ ప్రాంతానికి చెందిన మియాన్‌ అనే యువకుడికి సుల్తాన్‌గంజ్‌ గ్రామానికి చెందిన ఓ అమ్మాయితో పెళ్లి నిశ్చయించారు. మార్చి 14 ఉదయం వివాహ ముహూర్తం ఖరారు చేశారు. ఇరు పక్షాల బంధుమిత్రులు, అతిథులతో కళ్యాణమండపం సందడిగా ఉంది. పెళ్లి పీటలపై వరుడికోసం వధువు నిరీక్షిస్తోంది. ముహూర్తం దాటినా వరుడి జాడలేదు. దాంతో వధువు కుటుంబీకులు ఆందోళన చెందారు. పదేపదే ఫోన్ చేసినప్పటికీ వరుడు వైపు నుండి ఎటువంటి స్పందన లేదు.

చివరికి ముహూర్తం దాటిపోయిన తర్వాత మర్నాడు మధ్యాహ్నం సమయంలో వరుడు ఫుల్‌గా మద్యం సేవించి పెళ్లి మండపానికి వచ్చాడు. ఇది గమనించిన ఆ వధువు పెళ్లి రద్దు చేసుకొని అక్కడినుంచి వెళ్లిపోయింది. అంతేకాదు మియాన్‌ను, అతడితో వచ్చిన వారిని పట్టుకుని బంధించి తాము పెళ్లి కోసం ఖర్చుచేసిన మొత్తం తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. చివరికి గొడవ పోలీస్ స్టేషన్‌కు చేరింది. పోలీసులు ఇరుపక్షాలకు సర్ధిచెప్పి సయోధ్య కుదిర్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..