Viral Video: జాతివైరం మరచిన ఆవు.. పాలు ఇచ్చి పందిపిల్ల దాహార్తిని తీర్చిన గోమాత.. నెట్టింట్లో వీడియో వైరల్
ఆకలి ఎవరిదైనా ఒకటే అన్నట్లుగా ఆవు .. పందికి పాలు ఇచ్చి మాతృత్వాన్ని చాటుకుంది. పాలను తాగేందుకు వచ్చిన పందిని చూసి ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా తన పాలను పందికి పట్టింది. పంది పిల్ల దాహర్తిని తీర్చింది

ప్రతి ఒక్కరికీ సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ప్రపంచంలో ఎక్కడ ఏ వింత సంఘటలు చోటు చేసుకున్నా వెంటనే నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇలాంటి వీడియోల్లో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని మానవత్వం అంటే ఇదేనేమో అనిపించేవిగా ఉంటున్నాయి. ముఖ్యంగా జంతువులు చేసే పనులు.. చూపే తెలివితేటలు వంటి వీడియోలను ప్రతి ఒక్కరూ ఇష్టంగా చూస్తున్నారు. ముఖ్యంగా కొన్ని జంతువులు జాతి వైరం మరచి చూపించే ప్రేమకు సంబంధించిన వీడియోలు అయితే నెటిజన్లను మరింత ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఆవు దగ్గర పాలు తాగుతున్న పంది వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
ఆకలి ఎవరిదైనా ఒకటే అన్నట్లుగా ఆవు .. పందికి పాలు ఇచ్చి మాతృత్వాన్ని చాటుకుంది. పాలను తాగేందుకు వచ్చిన పందిని చూసి ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా తన పాలను పందికి పట్టింది. పంది పిల్ల దాహర్తిని తీర్చింది. ఈ వింత ఘటన నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ కేంద్రంలో జరిగింది. ఆకలితో ఏం చేయాలో తెలియక అటు ఇటు వెతుకుతున్న పందికి సెడన్ గా ఆవు కనిపించింది. వెంటనే ఆవు పొదుగు దగ్గరకు వెళ్లి మూతి పెట్టి దర్జాగా పాలు తాగసాగింది. పంది ఆకలిని గమనించి ఆవు.. కదలకుండా తన జాతికాదని ద్వేషించకుండా ఆకలితో ఉన్న తన బిడ్డకు పాలు ఇస్తుందో అదే రీతిలో పాలు ఇచ్చింది. పందికి పాలు ఇచ్చి మాతృత్వాన్ని చాటుకుంది. ఈఘటనను చూసిన స్తానికులు ఆశ్చర్యానికి గురయ్యారు.
ఆవు మానవత్వం చాటుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. మనుషులు సైతం ఆవును ఆదర్శంగా తీసుకోవాలంటూ ప్రశంసించారు. ఇది చూసిన స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. మొబైల్ ఫోన్ లో ఈ సంఘటనను చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..