Viral Video: ఈ బాహుబలి ముల్లంగిని పైకి ఎత్తాలంటే నలుగురు కావాల్సిందే .. నమ్మడంలేదా .. ఈ వీడియో చూడండి

Surya Kala

Surya Kala | Edited By: Janardhan Veluru

Updated on: Mar 18, 2023 | 11:48 AM

కొంతమంది తమ అభిరుచితో సరికొత్త రికార్డ్ సృష్టించాలని భావిస్తారు. ఇప్పటికే గుమ్మడికాయ, పుచ్చకాయ వంటి ఉత్పత్తులతో రికార్స్ ఉండగా.. తాజాగా ఇప్పుడు బాహుబలి వంటి ముల్లంగి గిన్నిస్ బుక్ లో చోటు దక్కించుకుంది.

Viral Video: ఈ బాహుబలి ముల్లంగిని పైకి ఎత్తాలంటే నలుగురు కావాల్సిందే .. నమ్మడంలేదా .. ఈ వీడియో చూడండి
Heaviest Radish

ప్రపంచంలో రకరకాల హాబీలున్నవారున్నారు ఉంటారు. కొందరికి రకరకాల వంటలు, సంగీతం సాహిత్యం, డ్యాన్స్ వంటి అనేక రకాల హాబీలున్నవారు ఉన్నారు. ఇలాంటి హాబీల్లో ఒకటి వ్యవసాయం చేయడం. చాలామంది తమకు అందుబాటులో ఉన్న వాటితోనే కూరగాయలు లేదా పండ్లను పండిస్తారు. కూరగాయలు పండించడానికి చాలా సమయం, ఓర్పు, నైపుణ్యం అవసరం. కొంతమంది తమ అభిరుచితో సరికొత్త రికార్డ్ సృష్టించాలని భావిస్తారు. ఇప్పటికే గుమ్మడికాయ, పుచ్చకాయ వంటి ఉత్పత్తులతో రికార్స్ ఉండగా.. తాజాగా ఇప్పుడు బాహుబలి వంటి ముల్లంగి గిన్నిస్ బుక్ లో చోటు దక్కించుకుంది.

జపనీస్ ఎరువులు, వ్యవసాయ ఉత్పత్తుల తయారీదారు మందా ఫెర్మెంటేషన్ కో.. లిమిటెడ్ కంపెనీ  అత్యంత భారీ ముల్లంగిని పండించి.. సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం..  అత్యంత బరువైన ముల్లంగి బరువు 45.865 కేజీలున్నట్లు తెలుస్తోంది.

జపాన్ కు చెందిన మందా ఫెర్మెంటేషన్ కంపెనీ ఆధునిక సాంకేతికతో వ్యవసాయ ఉత్పత్తులను తయారు చేస్తుంది. పులియబెట్టిన బొటానికల్ ముడి పదార్థాల నుండి సప్లిమెంట్లను..  ప్రత్యేక ఎరువులను ఉత్పత్తి చేస్తుంది. ఈ కంపెనీ ప్రతి సంవత్సరం అసాధారణమైన ముల్లంగిని పెంచుతారు. సాధారణ ముల్లంగిని మూడు నెలలో తీస్తారు. అయితే ఈ బాహుబలి ముల్లంగిని మాత్రం ఆరు తర్వాత తీశారు. ఈ రూట్ పొడవు 80 సెం.మీ ఉండగా.. చుట్టుకొలత 113 సెం.మీ. ఉంది. అత్యంత బరువైన ముల్లంగి వీడియోను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.

ఇవి కూడా చదవండి

బాహుబలి ముల్లంగి.. వీడియో చూడండి..

ఈ వీడియో కేవలం వారం క్రితం షేర్ చేయబడింది. పోస్ట్ చేసినప్పటి నుండి, ఇది 35,000 లైక్స్ ను సొంతం చేసుకుంది. రకరకాల కామెంట్స్  చేశారు.

ఒక వ్యక్తి పోస్ట్ చేసాడు, “నేను కిమ్చీ లాగా ఎంత రుచికరంగా ఉంటుందో అంటూ నేను ఆలోచిస్తున్నాను అంటే.. మరొకరు.. ఇది చాలా బాగుంది.” “మిసైల్ లాగా ఉంది!”అంటూ కామెంట్స్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu