Golden River: నది ఒడ్డున తవ్వగా కళ్లు జిగేల్.. బంగారు నాణేల కోసం పోటెత్తిన స్థానికులు

స్థానిక గిరిజన కార్మికులు ఈ ప్రాంతంలో మరింత నిధిని వెతకడానికి ఇసుకను ఫిల్టర్ చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. “అసలు బంగారం లభిస్తుందో లేదో తెలియదు కానీ గ్రామస్తులు గత మూడు రోజులుగా బంగారు కోసం వెతుకుతున్నారు.

Golden River: నది ఒడ్డున తవ్వగా కళ్లు జిగేల్.. బంగారు నాణేల కోసం పోటెత్తిన స్థానికులు
Bansloi River
Follow us

|

Updated on: Mar 18, 2023 | 12:24 PM

భారతదేశం అద్భుతాలకు నెలవు. రకరకాల పంటలను అందించే సారవంతమైన భూములు, ప్రపంచ ప్రసిద్దిగాంచిన వజ్రాలు, బంగారం గనులు, ఖనిజాలు లభ్యమవుతాయి. బంగారం, నవరత్నాలను రాశులుగా పోసి రోడ్డుమీద అమ్మినట్లు చరిత్రకారులు చెబుతూ ఉంటారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో, ఒడిశా-బెంగాల్-జార్ఖండ్ సరిహద్దులో బంగారం గనులున్నట్లు వెల్లడైన సంగతి తెలిసిందే. రాంచీకి దగ్గర్లో పిస్కా గ్రామంలో జన్మించిన సుబర్ణరేఖ నదిలో బంగారం లభిస్తోంది. ఈ నదిని సుబర్ణరేఖ, స్వర్ణ రేఖ నది అని కూడా పిలుస్తారు. ఇప్పటికే శాస్త్రజ్ఞులకు సవాల్ విసురుతున్న బంగారు నది గురించి ప్రపంచం ఇప్పటికే  విస్మయం చెందుతుండగా.. తాజాగా బెంగాల్‌లోని బీర్భూమ్‌లోని బన్‌స్లోయ్ నది ఒడ్డున బంగారం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నది దగ్గర బంగారం కోసం గ్రామస్థులు జల్లెడ పడుతున్నారు.

వారం ప్రారంభంలో గ్రామస్థులు స్నానం చేస్తున్న సమయంలో బంగారం దొరికింది. నదీ ఒడ్డున మట్టిని తవ్వుతుండగా బంగారం దొరికింది. ఈ బంగారం చాలా చిన్నది. పాత పైసా లాగా ఉంది.. దానిపై కొన్ని పురాతన అక్షరాలు లేదా గుర్తులు ఉన్నాయి” అని రాబిడాస్ నివాసి మీరా చెప్పారు.అంతేకాదు ఈ నది ఒడ్డున మరిన్ని బంగారం నగలు నాణేలు దొరుకుతాయని వ్యక్తం చేశాడు.

చక్రంలా ఉన్న బంగారు నాణేలు నది ఒడ్డున దొరికిన బంగారు నాణేలు చక్రాల రూపంలో ఉన్నాయి. ఇది పూర్వకాలంలో మన దేశాన్ని పాలించిన రాజులకు చెందినదని కొందరు నమ్ముతున్నారు. “ఇది హిందూ రాజుల కాలం నాటి నిధి” అని మరొక స్థానికుడు చెప్పాడు.

ఇవి కూడా చదవండి

స్థానిక గిరిజన కార్మికులు ఈ ప్రాంతంలో మరింత నిధిని వెతకడానికి ఇసుకను ఫిల్టర్ చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. “అసలు బంగారం లభిస్తుందో లేదో తెలియదు కానీ గ్రామస్తులు గత మూడు రోజులుగా బంగారు కోసం వెతుకుతున్నారు. తాను కూడా గ్రామస్థులతో చేరి బంగారం కోసం వెదికేందుకు వచ్చాను’’ అని స్థానికుడు సుజన్ షేక్ తెలిపారు.

మహేశ్‌పూర్ రాజ్‌బరి నుంచి జార్ఖండ్‌కు ఆనుకుని ఉన్న సుబర్ణరేఖ నది నీటిలో రాజుల కాలం నాటి బంగారు నాణేలు మునిగిపోయాయని భావిస్తున్నారు. రాజ్‌బరి నుంచి ఈ బంగారం సువర్ణరేఖ నది ద్వారా బన్స్‌లై నదికి చేరుతుంది. అయితే నదిలో బంగారం దొరుకుంటుంది అనేవి ఊహాగానాలు” అని బిశ్వభారతి విశ్వవిద్యాలయం చరిత్ర విభాగం ప్రొఫెసర్ బిద్యుత్ పటార్ అన్నారు.

మరోవైపు నది ఒడ్డున దొరికిన బంగారు నాణేన్ని మురరుయి పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. అయితే ఈ విషయంలో బిర్భమ్ జిల్లా యంత్రాంగం ఇంకా జోక్యం చేసుకోలేదు. ఈ నాణేల గురించి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు కూడా వివరించింది.

బంగారు నది? బన్‌స్లోయ్ నది భాగీరథికి ఉపనది. ఇది జార్ఖండ్‌లోని చోటా నాగ్‌పూర్ పీఠభూమిలోని సాహెబ్‌గంజ్‌లోని బాన్స్ హిల్‌లో ఉద్భవించింది. ఈ నది 2200 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. బెంగాల్‌లోని బీర్భూమ్ నుంచి  ముర్షిదాబాద్ జిల్లాల్లోకి ప్రవహిస్తుంది. భౌగోళికంగా.. ఈ పరీవాహక ప్రాంతం పీఠభూమి అంచు ప్రాంతం. ఈ నది చుట్టూ గిరిజనులు నివసిస్తున్నారు. వర్షాకాలంలో పొంగిపొర్లుతూ ఉంటుంది.

బన్‌స్లోయ్ నది ఒడ్డున బంగారు రేణువులను కనుగొనడం ఇదే మొదటిసారి కాదు. ప్రతి నెలా కనీసం 60-80 బంగారు రేణువులను వెలికితీస్తారని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!