AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Defamation Case: Defamation Case: నాటి ఇందిర నుంచి నేడు రాహుల్ వరకూ అనర్హత వేటు.. ఇప్పటి వరకూ ఎంతమంది సభ్యత్వం కోల్పోయారంటే..

అనర్హత వేటును ఎదుర్కొన్న నేతల్లో రాహుల్‌ ఫస్ట్‌పర్సన్‌ కాదు.. ఇలా ఎంతోమంది ప్రముఖులు తమ సభ్యత్వాలను కోల్పోయారు. అసలా మాటకొస్తే, రాహుల్‌గాంధీ స్వయానా నానమ్మ ఇందిరాగాంధీ సైతం అనర్హత వేటును ఎదుర్కొన్నారు. అప్పట్లోనే ఇందిరాగాంధీ తన లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోయారు

Defamation Case: Defamation Case: నాటి ఇందిర నుంచి నేడు రాహుల్ వరకూ అనర్హత వేటు.. ఇప్పటి వరకూ ఎంతమంది సభ్యత్వం కోల్పోయారంటే..
Rahul Defamation Case
Surya Kala
|

Updated on: Mar 25, 2023 | 9:44 AM

Share

కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీ మోడీ పేరుపై సంచలన వ్యాఖ్యలు చేసి ఇరుకున పడ్డారు. కోర్టు రాహుల్ కు జైలు శిక్ష విధించిన నేపథ్యంలో అనర్హత వేటు మరోసారి తెరపైకి వచ్చింది. ఇంతకీ, 1951 సెక్షన్‌ 8/3 ప్రజాప్రాతినిధ్య చట్టం ఏం చెబుతోంది. ఇలా అనర్హత వేటును ఎదుర్కొన్నది రాహుల్‌ ఒక్కరేనా!. గతంలో ఇంకేవరైనా ఉన్నారా? తెలుసుకుందా..

అనర్హత వేటును ఎదుర్కొన్న నేతల్లో రాహుల్‌ ఫస్ట్‌పర్సన్‌ కాదు.. ఇలా ఎంతోమంది ప్రముఖులు తమ సభ్యత్వాలను కోల్పోయారు. అసలా మాటకొస్తే, రాహుల్‌గాంధీ స్వయానా నానమ్మ ఇందిరాగాంధీ సైతం అనర్హత వేటును ఎదుర్కొన్నారు. అప్పట్లోనే ఇందిరాగాంధీ తన లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోయారు. 1971 ఎన్నికల్లో ఇందిర విజయం చెల్లదంటూ అలహాబాద్‌ హైకోర్టు తీర్పు ఇవ్వడంతో 1975 జూన్‌ 12న ఆమె తన పదవిని కోల్పోవాల్సి వచ్చింది.

ఆ తర్వాత ప్రముఖంగా చెప్పుకోవాల్సింది మరో పవర్‌ఫుల్‌ లేడీ లీడర్‌ అన్నాడీఎంకే మాజీ అధినేత్రి..  దివంగత తమిళనాడు సీఎం జయలలిత గురించే. జయలలిత సైతం జైలుశిక్ష కారణంగా అనర్హత వేటుకు గురయ్యారు. అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల జైలు, వందకోట్ల జరిమానా విధించడంతో 2014లో సీఎం కుర్చీ నుంచి దిగిపోవాల్సి వచ్చింది. అలా, అనర్హత వేటుపడిన మరో నాయకుడు లాలూప్రసాద్‌ యాదవ్‌. దాణా కుంభకోణంలో దోషిగా తేలడంతో 2013లో లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోయారు లాలూ. ఇదే తరహాలో తన శాసనసభ్యత్వాన్ని కోల్పోయారు సమాజ్‌వాదీ సీనియర్‌ నేత ఆజంఖాన్‌. విద్వేషపూరిత ప్రసంగం కేసులో రాంపూర్‌ కోర్టు దోషిగా తేల్చడంతో ఆజంఖాన్‌పై అనర్హత వేటేసింది యూపీ అసెంబ్లీ.

ఇవి కూడా చదవండి

ఆజంఖానే కాదు అతని కుమారుడు అబ్దుల్లా కూడా తన శాసనసభ్యత్వాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ఇదేవిధంగా తమ పదవులను కోల్పోయిన నేతలు ఎంతోమంది ఉన్నారు. జార్ఖండ్‌లో కమల్‌ కిశోర్‌ భగత్‌, ఎనోస్‌ ఎక్కా.. మహారాష్ట్రలో సురేష్‌ హల్వాంకర్‌, బాబన్‌రావు, పప్పు కలానీ.. తమిళనాడులో సెల్వగణపతి, మహారాష్ట్రలో ఆశారాణి, యూపీలో విక్రమ్‌ సింగ్‌, రషీద్ మసూద్‌, కుల్దీప్‌సింగ్‌, బీహార్‌లో జగదీశ్‌ శర్మ, అనిల్‌ కుమార్‌ సాహ్నీ, అనంత్‌సింగ్‌. హర్యానాలో ప్రదీప్‌చౌదరి లక్షద్వీప్‌ ఎంపీ మొహ్మద్‌ ఫైజల్‌… ఈవిధంగా తమ సభ్యత్వాలను కోల్పోయినవాళ్లే.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..