Pradhan Mantri Ujjwala Yojana: గ్యాస్ వినియోదారులకు బిగ్ రిలీఫ్.. మరో ఏడాదిపాటు రూ.200ల సబ్సిడీ..
కేబినెట్ నిర్ణయంతో దేశంలోని 9.5 కోట్ల మందికిపైగా ప్రజలు ప్రతి నెల గ్యాస్ సిలిండర్‌కు రూ.200 చొప్పున ప్రయోజనం పొందనున్నారు. ప్రభుత్వంపై రూ.7,680 కోట్ల భారం పడనుంది.
ఉజ్వల యోజన కింద ప్రతి సంవత్సరం 12 గ్యాస్ సిలిండర్లపై అందుతున్న సబ్సిడీని ఉజ్వల యోజన లబ్ధిదారులకు మరో ఏడాది పాటు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. దేశంలోని 9.5 కోట్ల మందికిపైగా వినియోగదారులు ప్రతి నెలా గ్యాస్ సిలిండర్‌పై రూ.200 ప్రయోజనం పొందనున్నారు. దీంతో ప్రభుత్వంపై రూ.7,680 కోట్ల భారం పెరగనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ముందుగా రూ.6,100 కోట్లు ఖర్చు చేశారు.
PMUY వినియోగదారు సగటు LPG వినియోగం 2019-20లో 3.01 రీఫిల్స్ నుంచి 2021-22లో 3.68కి అంటే 20 శాతం పెరిగింది. పేద కుటుంబాల నుంచి వయోజన మహిళలకు ఉచిత LPG కనెక్షన్లను అందించడానికి ప్రభుత్వం మే 2016లో ప్రధాన మంత్రి ఉజ్వల యోజనను ప్రారంభించింది.
సబ్సిడీ బ్యాంకు ఖాతాకు బదిలీ..
ఈ సబ్సిడీ నేరుగా అర్హులైన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ చేయబడుతుంది. ప్రభుత్వ చమురు మార్కెటింగ్ కంపెనీలు అంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) ఇప్పటికే మే 22, 2022 నుంచి ఈ సబ్సిడీని ఇస్తున్నాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తత కారణంగా, ఎల్‌పీజీ అంతర్జాతీయ ధరలో పెరుగుదల ఉంటుంది. ఇటువంటి పరిస్థితిలో, PMUY లబ్ధిదారులు LPG అధిక ధరల నుంచి బయటపడొచ్చు.
ఆకాశాన్ని అంటుతున్న గ్యాస్ సిలిండర్ ధరలు..
ప్రస్తుతం డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల ధరలు విపరీతంగా పెరిగాయి. మార్చి నెలలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర రూ.50 పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర ఒక్కో గ్యాస్ సిలిండర్ ధర రూ.1,103కి చేరినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
అలాగే, ముడి జూట్‌కు కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.5050లుగా నిర్ణయించారు. దీంతో 40లక్షల రైతులకు లబ్ది జరుగుతుందని కేంద్రం వెల్లడించింది. వీటితో పాటు 4 లక్షల కార్మికులకు ఉపాధి లభిస్తుందని తెలిపిన కేంద్రం.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 4% డీఏ పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న డీఏ 38% నుంచి 42%కి పెంచుతూ నిర్ణయించారు. అలాగే 01.01.2023 నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అదనపు విడత డీఏ, పెన్షనర్లకు డియర్‌నెస్ రిలీఫ్ విడుదలకు ఆమోదం తెలిపింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..