Rahul gandhi: 2019లో జరిగిందానికి రాహుల్ గాంధీని దోషిగా తేల్చిన కోర్టు..
పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీని దోషిగా తేల్చింది సూరత్ కోర్టు. పరువునష్టంకేసులో రాహుల్‌గాంధీకి రెండేళ్ల జైలుశిక్ష విధించింది కోర్టు.
పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీని దోషిగా తేల్చింది సూరత్ కోర్టు. పరువునష్టంకేసులో రాహుల్‌గాంధీకి రెండేళ్ల జైలుశిక్ష విధించింది కోర్టు. 2019లో మోడీ ఇంటిపేరుపై రాహుల్ వివాదాస్పద కామెంట్స్ చేశారు. దొంగలందరికీ మోదీ ఇంటి పేరేనంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు తప్పేనని కోర్టు తేల్చి చెప్పింది. గుజరాత్ మాజీ మంత్రి పూర్ణేష్ మోడీని ఉద్దేశించి రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కర్నాటకలోని కోలార్ సభలో రాహుల్ ఈ కామెంట్స్ చేశారు. రాహుల్ వ్యాఖ్యలపై క్రిమినల్ డెఫమెషన్ కేసు నమోదు చేశారు. రాహుల్‌పై పరువునష్టం దావా కేసుని విచారించిన సూరత్ కోర్టు రాహుల్‌ని దోషిగా నిర్ధారించింది.అయితే ఈ కేసులో వెంటనే బెయిల్ కూడా మంజూరు చేసింది న్యాయస్థానం.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jr.NTR – Ram Charan: ఎన్టీఆర్ తోపా..! రామ్ చరణ్ తోపా ..? డాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్..
Viral Video: ఇది బైక్ కాదు పుష్పక విమానం.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు..! వైరల్ వీడియో..
Vidya Balan: ఆ దర్శకుడు నన్ను రూమ్‌కు రమ్మన్నాడు.. విద్యాబాలన్. వీడియో