Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఇది బైక్ కాదు పుష్పక విమానం.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు..! వైరల్ వీడియో..

Viral Video: ఇది బైక్ కాదు పుష్పక విమానం.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు..! వైరల్ వీడియో..

Anil kumar poka

| Edited By: Phani CH

Updated on: Mar 24, 2023 | 8:51 AM

నెట్టింట వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఓ వ్యక్తి తన బైక్‌పై ఎక్కడికో బయలుదేశాడు. ఇంతలో ఒక వ్యక్తి వచ్చి తన లగేజ్‌తోపాటు ఆ బైక్‌ పైన కూర్చున్నాడు. వెంటనే మరోవ్యక్తి, విత్‌ లగేజ్‌..

సోషల్‌ మీడియా పుణ్యమా అని ఎంతోమంది ట్యాలెంటెడ్‌ పర్సన్స్‌ వెలుగులోకి వస్తున్నారు. దేశీ జుగాడ్‌లో తయారుచేయడంలో కొందరు తమ ప్రత్యేకతను చాటుకుంటారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక జుగాడ్ వీడియో వైరల్ అవుతుంది. ఇది చూసిన ఎవరైనా సరే షాక్ తినాల్సిందే. సాధారణంగా ఒక బైక్‌పైన ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తులు ప్రయాణించడం మనం చూశాం. కానీ ఈ బైక్‌పైన మాత్రం ఏకంగా 8 మంది ప్రయాణించొచ్చు… అవును, ఆబైక్‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట దూసుకుపోతోంది. నెట్టింట వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఓ వ్యక్తి తన బైక్‌పై ఎక్కడికో బయలుదేశాడు. ఇంతలో ఒక వ్యక్తి వచ్చి తన లగేజ్‌తోపాటు ఆ బైక్‌ పైన కూర్చున్నాడు. వెంటనే మరోవ్యక్తి, విత్‌ లగేజ్‌, ఆ మరుక్షణం మరో వ్యక్తి సేమ్‌ లగేజ్‌తో అలా ఒకరితర్వాత ఒకరు ఏకంగా 8 మంది ఆ బైక్‌పైన కూర్చుని రయ్‌మంటూ దూసుకెళ్లిపోయారు. ఈ వీడియోను ఐపీఎస్ రూపిన్ శర్మ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ వీడియోను ఇప్పటికే 11 లక్షల మందికి పైగా వీక్షించారు. వేలమంది లైక్‌ చేయగా పలువురు రకరకాల కామెంట్లు చేశారు. చిన్నపొరపాటు జరిగినా పెను ప్రమాదం తప్పదని ఒకరంటే.. ఈ వీడియోనే ప్రమాదాన్ని ఆహ్వానిస్తోందని మరొకరు అభిప్రాయపడ్డారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Naatu Naatu Song in Oscar 2023: వరల్డ్‌వైడ్‌గా ఆస్కార్‌ ఫీవర్‌.. ప్రపంచ వేదికపై తెలుగోడి సత్తా..

Allu Arjun – Shah Rukh Khan: షారుఖ్‌కు దిమ్మతిరిగే పంచ్‌ ఇచ్చిన బన్నీ.. వీడియో.

Allu Arjun: అర్జున్ రెడ్డి 2.O.. వచ్చేస్తున్నాడు పాన్ ఇండియా మూవీ.. కాస్కోండి మరి..!

Published on: Mar 24, 2023 07:33 AM