BSF Soldier: దేశ సరిహద్దుల వద్ద ఎముకలు కొరికే చలిలో మంచు పర్వతంపై సైనికుల కావలా.. మీ త్యాగానికి మా సలాం అంటున్న నెటిజన్లు
కాశ్మీర్ నియంత్రణ రేఖ దగ్గర పెట్రోలింగ్ చేస్తున్న బిఎస్ఎఫ్ జవాన్ ను సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఓ సైనికుడు మంచు పర్వతంపై సైనికుడు ఒక బరువైన వెపన్ ను పట్టుకుని గస్తీ కాస్తున్నాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు 'రాయల్ సెల్యూట్' చేస్తున్నారు.
దేశ రక్షణ తమ కర్తవ్యంగా భావించి కుటుంబాన్ని, తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆర్మీలో చేరే యువత గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఎండ, వాన, చలి ఎలాంటి వాతావరణ పరిస్థితులైనా సరే సరిహద్దుల్లో నిరంతరం కాపలాకాస్తూ ఉంటారు. తాజాగా కాశ్మీర్ నియంత్రణ రేఖ దగ్గర పెట్రోలింగ్ చేస్తున్న బిఎస్ఎఫ్ జవాన్ ను సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఓ సైనికుడు మంచు పర్వతంపై సైనికుడు ఒక బరువైన వెపన్ ను పట్టుకుని గస్తీ కాస్తున్నాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ‘రాయల్ సెల్యూట్’ చేస్తున్నారు. ధవళ వర్ణం వంటి మంచులో ఒక జవాన్ తెల్లటి యూనిఫారం ధరించి, సాలిడర్, రైఫిల్ పట్టుకుని, సరిహద్దులో పెట్రోలింగ్ చేస్తున్నాడు. అదే సమయంలో భారీ హిమపాతం కురుస్తున్నట్లు కపిస్తుంది.
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కశ్మీర్ అధికారిక ట్విట్టర్ ఖాతాలో మోకాలి లోతు మంచులో నడవడానికి కొట్టుమిట్టాడుతున్న సైనికుడి వీడియోను షేర్ చేసింది.
సైనికులు, సాయుధ దళాల సిబ్బంది తమ విధిని నిర్వర్తించేటప్పుడు వారు చేసే త్యాగాలకు ప్రజలు తరచుగా కృతజ్ఞతలు తెలియజేస్తూనే ఉంటారు. మంచుతో కప్పబడిన పర్వతాల మీద, మండించే ఎడారుల్లో ఎటువంటి పరిస్థితులైనా సరిహద్దుల్లో సైనికులు కాపలా ఉంటూ.. దేశాన్ని కాపాడుతూ ఉంటారు. శత్రువులు మన భూభాగంలో అడుగు పెట్టకుండా నిరంతరం సేవ చేస్తూ ఉంటారు.
जीत का समंदर चुनौतियों भरा है , पर मेरे अंदर भी उस जीत को पाने का एक ज़ज्बा भरा है।
कश्मीर सीमान्त । सीमा सुरक्षा बल – सर्वदा सतर्क l#LoC #BSF pic.twitter.com/O0WKBSfEcm
— BSF Kashmir (@BSF_Kashmir) March 23, 2023
“విజయ సముద్రం సవాళ్లతో నిండి ఉంది.. అయితే ఆ విజయాన్ని పొందాలనే అభిరుచి నాకు కూడా ఉంది. కాశ్మీర్ సరిహద్దులో మాత్రమే కాదు సాలు దేశ సరిహద్దు భద్రతా దళం – ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటుంది, ”అని BSF కాశ్మీర్ వీడియోకు క్యాప్షన్ ఇచ్చింది.
గురువారం పోస్ట్ చేసిన ఈ వీడియోకు 36,000 కంటే ఎక్కువ వ్యూస్ ను సొంతం చేసుకుంది. “నమస్కారం! జై హింద్!!” ఒకరు వ్యాఖ్యానించారు. “మా రక్షకులకు రాయల్ సెల్యూట్” అని మరొకరు అన్నారు. “ఇంత అద్భుతమైన సైనికులు మమ్మల్ని రక్షించడం గర్వంగా ఉంది. మీ త్యాగానికి అందరికీ ధన్యవాదాలు, ”అని మూడవవాడు ప్రశంసించాడు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..