AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: రైల్వే ప్రయాణీకులనుంచి కోటి రూపాయల జరిమానా వసూలు చేసిన మొదటి మహిళా టీసీ .. రైల్వే శాఖ ప్రశంసలు

తన ట్వీట్‌లోనే.. రోస్లిన్ అరో కియా మేరీ సాధించిన విజయాన్ని ప్రస్తావిస్తూ, టికెట్ చెకింగ్‌లో రూ. 1.03 కోట్లు రికవరీ చేసిన భారతదేశపు మొదటి మహిళా టిక్కెట్ చెకర్‌గా ఆమె నిలిచారని రైల్వే పేర్కొంది.

Indian Railways: రైల్వే ప్రయాణీకులనుంచి  కోటి రూపాయల జరిమానా వసూలు చేసిన మొదటి మహిళా టీసీ .. రైల్వే శాఖ ప్రశంసలు
Rosaline Arokia
Follow us
Surya Kala

|

Updated on: Mar 24, 2023 | 8:09 AM

భారతీయ రైల్వే మంత్రిత్వ శాఖ ఇటీవల ఒక మహిళా టీసీపై ప్రశంసల వర్షం కురిపించింది. రైల్వే ప్రయాణీకుల నుంచి కోటి రూపాయలకు పైగా జరిమానా వసూలు చేసిన తొలి భారతీయ మహిళా టీసీగా ఆమె గుర్తింపు పొందారు. దక్షిణ రైల్వేలో ప్రిన్సిపల్ టికెట్ ఇన్‌స్పెక్టర్‌గా నియమితులయ్యారు. రైల్వే మంత్రిత్వ శాఖ  అధికారిక ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ.. ఈ ఘనత సాధించినందుకు మహిళా టీసీకి అభినందనలు తెలిపింది.

రైల్వే మంత్రిత్వ శాఖ చేసిన పోస్ట్ లో అధిక జరిమానా వసూలు చేసిన మహిళా టిక్కెట్ చెకర్ రోస్లిన్ అరో కియా మేరీ అని పేర్కొంది. రైల్వే మంత్రిత్వ శాఖ  అరో కియాకు అభినందనలు తెలిపింది. అరోకియా తన విధులను ఎంతో నిబద్ధతతో పనిచేస్తున్నారని రైల్వే మంత్రిత్వ శాఖ ట్వీట్‌లో రాసింది. తన ట్వీట్‌లోనే.. రోస్లిన్ అరో కియా మేరీ సాధించిన విజయాన్ని ప్రస్తావిస్తూ, టికెట్ చెకింగ్‌లో రూ. 1.03 కోట్లు రికవరీ చేసిన భారతదేశపు మొదటి మహిళా టిక్కెట్ చెకర్‌గా ఆమె నిలిచారని రైల్వే పేర్కొంది.

ఇవి కూడా చదవండి

రైల్వే ఈ పోస్ట్‌ను ఒక రోజు క్రితం షేర్ చేసింది. ఈ ట్వీట్ చేసినప్పటి నుండి, ఇప్పటివరకు దీనికి 700 కంటే ఎక్కువ లైక్‌లు వచ్చాయి  350 మందికి పైగా రీట్వీట్ చేసారు. ఈ సందర్భంగా.. ఈ విజయాన్ని సాధించినందుకు చాలా మంది రోస్లిన్ అరో కియాను  అభినందించారు. కొంతమంది పని పట్ల రోస్లిన్ అరో కియా అభిరుచికి సెల్యూట్ చేశారు.

కొన్ని రోజుల క్రితం.. టిక్కెట్లు లేకుండా ప్రయాణించే వారిపై చర్యలు తీసుకోవడమే కాదు.. దేశం మొత్తంలో అత్యధిక జరిమానా విధించినందుకు చెన్నై డివిజన్‌ను రైల్వే ప్రశంసించిన సంగతి తెలిసిందే. ఈ డివిజన్ కు చెందిన ముగ్గురు టిక్కెట్ చెక్కర్లు సరికొత్త రికార్డు సృష్టించారు. రైల్వే చెన్నై డివిజన్ చీఫ్ టికెట్ ఇన్‌స్పెక్టర్ ఎస్. నంద్ కుమార్ ఏడాది వ్యవధిలో 27,787 మందిని పట్టుకుని వారి నుంచి మొత్తం రూ.1.55 కోట్లు రికవరీ చేశారు. ఇది స్వతహాగా రికార్డు. వీరితో పాటు రైల్వే నిబంధనలకు విరుద్ధంగా లగేజీలు తీసుకెళ్లి టికెట్లు లేకుండా ప్రయాణించే వారి నుంచి సీనియర్ టిక్కెట్ ఇన్‌స్పెక్టర్ శక్తివేల్ రూ.1.10 కోట్లు రికవరీ చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..