కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి..జాగ్రత్త పడకపోతే ఇక అంతే సంగతులు
దేశంలో గత కొన్ని రోజులుగా కరోనా కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పుడిప్పుడే కరోనా బారి నుండి దూరమయ్యామని అనుకునేలోపే మళ్లీ కొవిడ్ కేసులు పెరగడం కలవర పెడుతోంది.
దేశంలో గత కొన్ని రోజులుగా కరోనా కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పుడిప్పుడే కరోనా బారి నుండి దూరమయ్యామని అనుకునేలోపే మళ్లీ కొవిడ్ కేసులు పెరగడం కలవర పెడుతోంది. దీనికి తోడు ఇన్ ఫ్లుయెంజా కేసులు తోడవడంతో మరిన్ని కేసులు పెరుగుతున్నాయి. దాదాపు 140 రోజుల తర్వాత మళ్లీ ఇప్పుడు అత్యధికంగా కరోనా కేసులు నమోదయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు దేశంలో 1300 కరోనా కేసులు గుర్తించారు. గత ముందురోజుతో పోలిస్తే 166 కేసులు పెరిగాయి. ఈ మహమ్మారి వల్ల ఇప్పటికే కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో ముగ్గరు ప్రాణాలు విడిచారు.
బుధవారం ఒక్కరోజే సుమారు 718 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో రికవరీ రేటు 98.79 శాతంగా ఉంది. ఇక యాక్టివ్ కేసులు 0.02 శాతంగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. దేశంలో బుధవారం 7,530 మంది కొవిడ్ వ్యాక్సిన్ లు అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన టీకాల డోసుల సంఖ్య 220.65 కోట్లకు చేరింది. బుధవారం నాడు ఒక్కరోజే 89,078 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ ఆసుపత్రుల్లో చేరుతున్నవారి సంఖ్య తక్కువగానే ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ తెలిపారు. అలాగే మరణాల్లో కూడా ఎటువంటి పెరుగుదల నమోదు కాలేదని వెల్లడించారు.