Tamil Nadu: ఆన్‌లైన్‌ రమ్మీ నిషేధంపై చర్చ.. తమిళనాడు అసెంబ్లీలో తీవ్ర ఉద్రిక్తత.. ఎమ్మెల్యేల మధ్య తోపులాట..

ఆన్‌లైన్‌ రమ్మీ నిషేధంపై చేపట్టిన చర్చ సందర్భంగా తమిళనాడు అసెంబ్లీలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఒకే పార్టీకి చెందిన సభ్యుల మధ్య వివాదం రాజేసింది. అన్నాడీఎంకేలో ఇరువర్గాలకు చెందిన ఎమ్మెల్యేల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.

Tamil Nadu: ఆన్‌లైన్‌ రమ్మీ నిషేధంపై చర్చ.. తమిళనాడు అసెంబ్లీలో తీవ్ర ఉద్రిక్తత.. ఎమ్మెల్యేల మధ్య తోపులాట..
Tamil Nadu Assembly
Follow us
Venkata Chari

|

Updated on: Mar 24, 2023 | 5:30 AM

ఆన్‌లైన్‌ రమ్మీ నిషేధంపై చేపట్టిన చర్చ సందర్భంగా తమిళనాడు అసెంబ్లీలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఒకే పార్టీకి చెందిన సభ్యుల మధ్య వివాదం రాజేసింది. అన్నాడీఎంకేలో ఇరువర్గాలకు చెందిన ఎమ్మెల్యేల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆన్‌లైన్‌ రమ్మీని నిషేధిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టంపై చర్చ సందర్భంగా గొడవకు దారితీసింది. తాను ఆన్‌లైన్‌ రమ్మీ నిషేధాన్ని సమర్ధిస్తునట్టు ప్రకటించారు పన్నీర్‌ సెల్వం. అదే సమయంలో పళనిస్వామి ఈ వ్యాఖ్యలకు తీవ్ర అభ్యంతరం తెలిపారు.

అన్నాడీఎంకే చీఫ్ నేను.. ఓపీఎస్ ఎలా నిర్ణయం చెబుతారని ఈపీఎస్ సభలో ప్రశ్నించారు. దీంతో ఇరువర్గాలకు చెందిన ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం జరిగింది. అనూహ్యంగా ఒకే పార్టీకి చెందిన ఎమ్మెల్యేల మధ్య తోపులాట జరగడం మిగతా సభ్యులను ఆశ్చర్యపరిచింది. ఓపిఎస్‌కు మాట్లాడే అవకాశం ఎలా ఇస్తారని స్పీకర్‌ని ప్రశ్నించారు ఈపీఎస్. పొలిటికల్‌గా ఎవరి అజెండా వారిదే అయినా.. ఈ ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ గేమ్స్‌ను అరికట్టడంలో కలిసి రావాలని కోరారు సీఎం స్టాలిన్ ప్రతిపక్షాలను కోరారు. ఇవి ప్రాణాలనూ బలిగొంటున్నాయని అన్నారు.

తమిళనాడులో ఈ యాప్స్ కారణంగా ఒత్తిడికి లోనై 47 మంది ఆత్మహత్య చేసుకున్నారు. అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ బిల్‌ను తీసుకొచ్చిందన్న స్టాలిన్ ఆన్‌లైన్ గేమ్స్‌ సమస్యలు రానురాను మరీ సంక్లిష్టంగా మారుతున్నాయని అన్నారు. కొందరు ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ గేమ్స్‌కి అలవాటు పడి, మోసపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో ఈ తరహా ఘటనలు పెరిగాయి. అందుకే.. తమిళనాడు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ఇవి కూడా చదవండి

జస్టిస్ చంద్రు ప్యానెల్ ఇచ్చిన నివేదిక ప్రకారం.. ఆన్‌లైన్ రమ్మీపై పూర్తిగా నిషేధం విధిస్తున్నట్లు తెలిపారు. గతంలో రెండు సార్లు ఈ బిల్ పాస్ చేయాలని చూసినా.. మద్రాస్ హైకోర్ట్ తీర్పుతో అది సాధ్యపడలేదన్నారు. మొత్తానికి అసెంబ్లీ ఆమోదం పొందిన బిల్లు.. గవర్నర్‌ ఆమోదం తర్వాత అమల్లోకి రానుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..