Shreyas Iyer: ఐపీఎల్, డబ్ల్యూటీసీ ఫైనల్ నుంచి శ్రేయాస్ ఔట్.. కొత్త సారథి వేటలో కేకేఆర్..

భారత టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్ ఐపీఎల్ (IPL), ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్స్‌కు దూరంగా ఉండవచ్చని తెలుస్తోంది. వెన్నునొప్పి కారణంగా, శ్రేయాస్ ఆస్ట్రేలియాతో అహ్మదాబాద్ టెస్టు, వన్డే సిరీస్‌లలో కూడా ఆడలేకపోయాడు.

Shreyas Iyer: ఐపీఎల్, డబ్ల్యూటీసీ ఫైనల్ నుంచి శ్రేయాస్ ఔట్.. కొత్త సారథి వేటలో కేకేఆర్..
Kkr Ipl 2023
Follow us

|

Updated on: Mar 23, 2023 | 5:45 AM

భారత టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్ ఐపీఎల్ (IPL), ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్స్‌కు దూరంగా ఉండవచ్చని తెలుస్తోంది. వెన్నునొప్పి కారణంగా, శ్రేయాస్ ఆస్ట్రేలియాతో అహ్మదాబాద్ టెస్టు, వన్డే సిరీస్‌లలో కూడా ఆడలేకపోయాడు. నివేదికల ప్రకారం, వైద్యులు శ్రేయాస్ అయ్యర్‌కు శస్త్రచికిత్స చేయాలని సూచించారు. అతను శస్త్రచికిత్స చేయించుకుంటే, మైదానంలోకి తిరిగి రావడానికి కనీసం 5 నెలలు పట్టవచ్చంట. ఇటువంటి పరిస్థితిలో అతను రాబోయే ముఖ్యమైన టోర్నీలో ఆడడం కష్టమే.

శ్రేయాస్‌కి శస్త్రచికిత్స లండన్‌లో లేదా భారతదేశంలోని మరేదైనా ఆసుపత్రిలో జరుగుతుందని నివేదికలలో పేర్కొన్నారు. ఈ సమయంలో అతనిపై బీసీసీఐ ఓ కన్నేసి ఉంచుతుంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇప్పటి వరకు అయ్యర్ గురించి ఏమీ చెప్పలేదు.

వన్డే ప్రపంచకప్‌ ఆడే అవకాశాలు.. WTC, IPL ఆడడం కష్టం..

మార్చి 31 నుంచి ఐపీఎల్ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. ఈ టోర్నీ మే నెలాఖరు వరకు కొనసాగనుంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ జూన్ 7 నుంచి 11 వరకు ఇంగ్లాండ్‌లోని ఓవల్‌లో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగనుంది. వన్డే ప్రపంచకప్ విషయానికొస్తే.. అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కానుంది. అంటే సర్జరీ జరిగితే అయ్యర్‌కు ఈ టోర్నీ ఆడే అవకాశం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

కెప్టెన్సీ వేటలో కేకేఆర్..

IPL 2022 మెగా వేలంలో, KKR అయ్యర్‌ను రూ. 12.25 కోట్లకు కొనుగోలు చేసింది. గత సీజన్‌లో అయ్యర్ కెప్టెన్సీలో కేకేఆర్ రాణించలేకపోయినా.. తన బ్యాట్‌తో అద్భుతంగా ఆడాడు. నివేదికల ప్రకారం, అయ్యర్ గాయం తర్వాత, KKR కొత్త కెప్టెన్సీ ఎంపికల కోసం వెతకడం ప్రారంభించింది. ఇప్పటి వరకు, అయ్యర్ గాయం, కెప్టెన్సీకి సంబంధించి KKR ఎటువంటి అధికారిక ప్రకటనను విడుదల చేయలేదు.

గాయం కారణంగా న్యూజిలాండ్‌తో వన్డేలు ఆడలేదు. ఆపై గాయపడిన అయ్యర్ గాయం కారణంగా న్యూజిలాండ్‌తో 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ మొదటి టెస్ట్ ఆడలేదు. అతను బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)లో పునరావాసం పూర్తి చేశాడు.

ఆ తర్వాత టెస్టు జట్టులోకి తిరిగి వచ్చాడు. అహ్మదాబాద్‌లో ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రెండో, మూడో టెస్టులు ఆడాడు. వెన్నునొప్పి మళ్లీ పెరిగింది, నాల్గవ టెస్టు నుంచి శ్రేయాస్ అవుట్ అయ్యాడు. అతను జట్టులో ఉన్నాడు. కానీ, బ్యాటింగ్‌కు రాలేదు. అనంతరం స్కానింగ్‌కు పంపారు. అక్కడ అతని గాయం తీవ్రంగా ఉన్నట్లు గుర్తించారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..