World Cup 2023: భారత ప్రభుత్వంతో టాక్స్ వివాదం.. బీసీసీకి తలనొప్పిలా మారిన వన్డే ప్రపంచకప్..
ICC ODI WC 2023: వన్డే ప్రపంచ కప్ 2023 సంవత్సరం చివరిలో భారతదేశంలో నిర్వహించనున్నారు. ఇది అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కానుంది. మొత్తం 48 మ్యాచ్‌లు జరగనున్నాయి.
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ 2023 భారతదేశంలో నిర్వహింనున్న సంగతి తెలిసిందే. దీని కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రపంచకప్ వంటి ఈవెంట్ల షెడ్యూల్‌ను ఏడాది ముందుగానే విడుదల చేయనుంది. కానీ, ఈసారి అది జరగలేదు. ఇప్పుడు వస్తున్న వార్తల ప్రకారం భారత ప్రభుత్వానికి ఐసీసీ తరపున బీసీసీఐ రూ.936 కోట్ల పన్ను చెల్లించనుంది.
ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతే 2023 వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ కూడా విడుదల కానుంది. వన్డే ప్రపంచకప్ ప్రసారం ద్వారా ఐసీసీ దాదాపు రూ.4500 కోట్లు ఆర్జించే అవకాశం ఉంది. అదే సమయంలో ఐసీసీ ఒప్పందం ప్రకారం, పెద్ద ఈవెంట్ సమయంలో ఆతిథ్య దేశం పన్ను మినహాయించే నిబంధన ఉంది. కానీ, 2016 టీ20 ప్రపంచ కప్ సమయంలో ఇది జరగలేదు.
ఈ వివాదం తర్వాత, ఐసీసీ సెంట్రల్ పూల్ నుంచి అందుకున్న మొత్తంలో సుమారు 200 కోట్ల రూపాయల తగ్గింపును బీసీసీఐ ఎదుర్కోవలసి వచ్చింది. అదే సమయంలో క్రిక్ఇన్ఫో నివేదిక ప్రకారం, 2016 నుంచి 2023 వరకు, బీసీసీఐ సెంట్రల్ పూల్ ఆఫ్ ఐసీసీ నుంచి సుమారు రూ. 3400 కోట్లు పొందవలసి ఉంది. అందులో ఈ పన్ను ఈ ఆదాయం నుంచి తీసివేయబడుతుంది.
ఈ వివాదం త్వరలోనే పరిష్కారమవుతుందని బీసీసీఐ భావిస్తోంది..
ఈ పన్ను వివాదానికి సంబంధించి త్వరలోనే పరిష్కారమవుతుందని బీసీసీఐ ఆశాభావం వ్యక్తం చేసింది. మరోవైపు, క్రిక్‌ఇన్ఫో నివేదిక ప్రకారం, వన్డే ప్రపంచ కప్ 2023 అక్టోబర్ 5 నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో ఈసారి మొత్తం 10 జట్లు పాల్గొంటాయి. ఈ మెగా ఈవెంట్‌ను నిర్వహించడానికి బీసీసీఐ దాదాపు 12 గ్రౌండ్‌లను షార్ట్‌లిస్ట్ చేసింది. ఇందులో ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నిర్వహించనున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..