Delhi University: నెలకు రూ.1,82,400ల జీతంతో ఢిల్లీ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు.. ఈ అర్హతలు అవసరం..

కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని కాలేజ్ ఆఫ్ ఒకేషనల్ స్టడీస్.. 106 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కామర్స్, కంప్యూటర్ సైన్స్, ఎకనామిక్స్ తదితర సబ్జెక్టుల్లో..

Delhi University: నెలకు రూ.1,82,400ల జీతంతో ఢిల్లీ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు.. ఈ అర్హతలు అవసరం..
Delhi University
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 23, 2023 | 9:37 PM

కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని కాలేజ్ ఆఫ్ ఒకేషనల్ స్టడీస్.. 106 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కామర్స్, కంప్యూటర్ సైన్స్, ఎకనామిక్స్, ఇంగ్లిష్, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్, హిందీ, హిస్టరీ, మ్యాథ్స్, మేనేజ్‌మెంట్, ఫిజికల్ ఎడ్యుకేషన్, పొలిటికల్ సైన్స్, టూరిజం తదితర విభాగాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 55 శాతం మార్కులతో మాస్టర్స్‌ డిగ్రీ లేదా ఎంఫిల్‌/పీహెచ్‌డీ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. యూజీసీ నెట్‌/సీఎస్‌ఐఆర్‌లో అర్హత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో ఏప్రిల్‌ 15, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్‌/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్ధులు ఖచ్చితంగా రూ.500లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. విద్యార్హతలు, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.57,700ల నుంచి రూ.1,82,400ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌చేసుకోవచ్చు.

నోటిఫికేషన్ కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.