Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఇంటికొచ్చిన అతిథిని పట్టించుకోరే.. అలా అటకెక్కి కూర్చుంటారా? వీడియో వైరల్‌

పాములంటే భయపడని వారెవరుంటారు చెప్పండి.. అందులోనూ చెప్పాపెట్టకుండా కళ్లముందు ప్రత్యక్షమైతే కాళ్ల కింద భూమి కంపించినంత పనవుతుంది. మీకే ఇటువంటి సంఘటన ఎదురైతే ఏం చేస్తారు..? ఛత్తీస్‌గఢ్‌లోని కొరాబా జిల్లాలో..

Viral Video: ఇంటికొచ్చిన అతిథిని పట్టించుకోరే.. అలా అటకెక్కి కూర్చుంటారా? వీడియో వైరల్‌
Viral Video
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 23, 2023 | 7:26 PM

పాములంటే భయపడని వారెవరుంటారు చెప్పండి.. అందులోనూ చెప్పాపెట్టకుండా కళ్లముందు ప్రత్యక్షమైతే కాళ్ల కింద భూమి కంపించినంత పనవుతుంది. మీకే ఇటువంటి సంఘటన ఎదురైతే ఏం చేస్తారు..? ఛత్తీస్‌గఢ్‌లోని కొరాబా జిల్లాలో అచ్చం ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోన్న ఈ వీడియోవైపు మీరూ ఓ లుక్కేసుకోండి..

ఎలా వచ్చిందో తెలీదుగానీ ఇంట్లో మూసి వున్న తలుపు ముందు కూర్చున్న ఓ నాగుపాము ఉండటం ఈ వీడియోలో చూడొచ్చు. బయటి వాళ్లు లోపలికి రాకుండా.. లోపలి వాళ్లు బయటికి పోకుండా గడప దగ్గరే పాము పడగవిప్పి కూర్చుని ఉంటుంది. అదే ఇంటి లోపల చిక్కుకున్న ముగ్గురు వ్యక్తులు పామును చూసి ప్రాణ భయంతో అటకెక్కి కూర్చుంటారు. బయటికి పరుగెత్తుదామంటే నాగుపాము తలుపు దగ్గరే తిష్ట వేసి కూర్చుంది. పోనీ సాయం కోసం ఎవరినైనా పిలుద్దామంటే తలుపులు మూసి ఉన్నాయి. దీంతో చేసేదిలేక అటకమీదే ఆ ముగ్గురు దిగులుగా కూర్చుని పాము వైపే భయంగా చూస్తుంటారు. ఇక వాళ్లెందుకు అటకెక్కారో తనకు తెలీనేతెలియదన్నట్లు పాము వాళ్లవైపే చూస్తూ ఉండటం వీడియోలో చూడవచ్చు. ఈ వీడియోను No2 పాలిటిక్స్ అనే యూజర్ సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. వేలల్లో వీక్షణలు, లైక్‌లు, కామెంట్‌లు రావడంతో సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్‌ అయ్యింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.