Crime News: కొడుకుకు పెళ్లి చేసి జైలు పాలైన తండ్రి.. ఒకేఒక్క నిర్ణయంతో అడ్డం తిరిగిన కథ..

కొడుకు పెళ్లి చేసేందుకు అప్పులపాలైన తండ్రి అప్పు తీర్చేందుకు షాకింగ్‌ నిర్ణయం తీసుకున్నాడు. కట్‌చేస్తే పోలీస్‌ స్టేషన్‌లో ఊచలు లెక్కబెట్టవల్సి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

Crime News: కొడుకుకు పెళ్లి చేసి జైలు పాలైన తండ్రి.. ఒకేఒక్క నిర్ణయంతో అడ్డం తిరిగిన కథ..
MP Crime News
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 22, 2023 | 10:25 AM

కొడుకు పెళ్లి చేసేందుకు అప్పులపాలైన తండ్రి అప్పు తీర్చేందుకు షాకింగ్‌ నిర్ణయం తీసుకున్నాడు. కట్‌చేస్తే పోలీస్‌ స్టేషన్‌లో ఊచలు లెక్కబెట్టవల్సి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లోని బంగంగా ప్రాంతానికి చెందిన రాజేంద్ర పండిట్ ఓ వ్యక్తివద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గత నెలలో రాజేంద్ర తన కొడుకుకు పెళ్లి చేశాడు. ఈ పెళ్లి వల్ల రాజేంద్ర రూ.4 నుంచి 5 లక్షల వరకు అప్పుల పాలయ్యాడు. అప్పు తీర్చేమార్గం దొరకకపోవడంతో ఏకంగా యజమానికే ఎసరు పెట్టాడు. యజమాని బ్యాంకు నుంచి డ్రా చేసి కారులో ఉంచిన రూ.4 లక్షల నగదును కాజేశాడు. ఐతే ఈ మొత్తం దృశ్యాలు కారు సమీపంలోని సీసీటీవీలో నమోదయ్యాయి.

కారులో డబ్బులు మాయమైనట్లు గ్రహించిన యజమాని రాజేంద్రను డబ్బు విషయమై ప్రశ్నించాడు. తనకు తెలియదని రాజేంద్ర బుకాయించాడు. దీంతో యజమాని స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. చోరీపై ఫిర్యాదు అందడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించి పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. సీసీటీవీల్లో రికార్డు అయిన దృశ్యాల ఆధారంగా నిందితుడు రాజేంద్రగా పోలీసులు గుర్తించారు. దీంతో  రాజేంద్రను అరెస్టు చేసి, చోరీ చేసిన సొమ్మును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

చెక్‌పోస్ట్ దగ్గర ఆగిన బోలోరో కారు చెక్ చేయగా.. లోపల కనిపించింది
చెక్‌పోస్ట్ దగ్గర ఆగిన బోలోరో కారు చెక్ చేయగా.. లోపల కనిపించింది
గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా
గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా
విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..
విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..
సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే
సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!
జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..
జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..
టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా
టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా
రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..
రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..
ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!
ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!
హలో.. ఎక్స్‌క్యూజ్‌మీ.. సైడ్‌ ప్లీజ్‌.! ఏనుగు సిగ్నల్స్ మాములుగా
హలో.. ఎక్స్‌క్యూజ్‌మీ.. సైడ్‌ ప్లీజ్‌.! ఏనుగు సిగ్నల్స్ మాములుగా