Strong Bones: ఎముకలు పుష్టిగా ఉండాలంటే వీటిని రోజూ.. ఓ స్పూన్ తిన్నారంటే..
ఎముకలు బలంగా, పుష్టిగా ఉంటేనే శరీరం దృఢంగా ఉంటుంది. లేదంటే ఎముకలు బలహీణపడి చిన్న ఒత్తిడికే పుటుక్కున విరుగుతాయి. కట్టుకట్టినా తొందరగా అతుక్కోదు. ఒకవేళ అతుకున్నా బలంగా ఉండవు. ఇవి బలంగా ఉండాలంటే..
ఎముకలు బలంగా, పుష్టిగా ఉంటేనే శరీరం దృఢంగా ఉంటుంది. లేదంటే ఎముకలు బలహీణపడి చిన్న ఒత్తిడికే పుటుక్కున విరుగుతాయి. కట్టుకట్టినా తొందరగా అతుక్కోదు. ఒకవేళ అతుకున్నా బలంగా ఉండవు. ఇవి బలంగా ఉంటే రోజువారీ కార్యకలాపాలు సులువుగా చేసేందుకు శరీరం సహకరిస్తుంది. మరి ఎముకలు బలంగా ఉండాలంటే ఏం చెయ్యాలనే సందేహం మీకు కలుగుతుందా? ఎముకలు పుష్టిగా ఉండాలంటే బలవర్ధకమైన ఆహారం తినాలి. అయితే గతితప్పిన ఆహార అలవాట్ల కారణంగా మనకు తెలియకుండానే ఎముకలు బలహీనపడతాయి. దానివల్ల ఆరోగ్యం, శరీర నిర్మాన వ్యవస్థ పతనమవుతుంది. బలమైన ఎముకలకు కాల్షియం ఎంతో అవసరం. కాల్షియం అనేక రకాల ఆహారాలలో లభిస్తుంది. పాలు, గుడ్లు, నువ్వులు, రాగులు, కిడ్నీ బీన్స్ లేదా రాజ్‌మా, సోయా బీన్స్, బాదం పప్పు, బ్రొకోలీ, చిలగడదుంప, బెండకాయ, పొద్దుతిరుగుడు గింజలు, నారింజ పండ్లు, మెంతి కూర, మునగాకు, క్యాబేజీ తదితర ఆకుపచ్చని కూరగాయల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. వీటితోపాటు పాటు గసగసాలు కూడా ఎముకల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
గసగసాల్లో కాల్షియంతోపాటు, ప్రోటీన్, ఐరన్, మెగ్నీషియం, ఫైబర్, జింక్, కాపర్, సెలీనియం, విటమిన్ ఇ వంటి అనేక పోషకాలు ఉన్నాయి. వీటిని రోజువారీ ఆహారంలో వివిధ మార్గాల్లో తినవచ్చు. గసగసాల్లో జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ అధికంగా ఉంటుంది. వీటిని తినడం వల్ల జీర్ణక్రియ ప్రక్రియ సక్రమంగా పనిచేస్తుంది. అలాగే గసగసాలలో కార్బోహైడ్రేట్లు కూడా అధికంగా ఉంటాయి. ఇది శరీరానికి శక్తిని అందిస్తాయి. వీటిల్లోని థియోనిన్ అనే అమైనో ఆమ్లం రాత్రిళ్లు బాగా నిద్రపోవడానికి సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని లైఫ్‌స్టైల్ సమాచారం కోసం క్లిక్ చేయండి.