ఈసారి కొత్త జెర్సీతో రానున్న రాజస్థాన్ రాయల్స్
మరికొన్ని రోజుల్లో క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్న ఐపీల్ పండుగ రానుంది. అయితే రాజస్థాన్ రాయల్స్ టీమ్ తమ అభిమానులకు మరింత కిక్కిచ్చే విషయం తెలిపింది.
మరికొన్ని రోజుల్లో క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్న ఐపీల్ పండుగ రానుంది. అయితే రాజస్థాన్ రాయల్స్ టీమ్ తమ అభిమానులకు మరింత కిక్కిచ్చే విషయం తెలిపింది. ఈసారి కొత్త జెర్సీతో రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ మ్యాచ్ లు ఆడనుంది. మార్చి 21న తమ జెర్సీలను గ్రౌండ్ లో పనిచేసే సిబ్బందితోనే ఆవిష్కరించింది. ఆటకు ముందు మైదానాన్ని సిద్ధం చేయడంలో గ్రౌండ్ సిబ్బంది శ్రమను కొనియాడుతూ రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ ప్రత్యేకంగా ఓ వీడియోను తమ అధికారిక యూట్యూబ్ ఛానల్ లో విడుదల చేసింది. మునపటితో పోలిస్తే కొత్త జెర్సీలో కొన్ని మార్పులు చేశారు. ఇదిలా ఉండగా రాజస్థాన్ జట్టుకు ఈసారి కూడా హెడ్ కోచ్ గా కుమార సంగక్కర ఉండనున్నారు. అసిస్టెంట్ కోచ్ గా ట్రెవర్ పెన్నీ, ఫాస్ట్ బౌలింగ్ కోచ్ గా కొనసాగనున్నారు.
ఇవి కూడా చదవండిView this post on Instagram
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..