Chetan Kumar: హిందుత్వంపై అభ్యంతరకర ట్వీట్.. కన్నడ యాక్టర్ అరెస్ట్..

హిందుత్వంపై అభ్యంతరకర ట్వీట్ చేశాడంటూ కన్నడ యాక్టర్ చేతన్ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. చేతన్ అహింసగా కూడా యాక్టర్‌ను బెంగళూరులో శేషాద్రిపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Chetan Kumar: హిందుత్వంపై అభ్యంతరకర ట్వీట్.. కన్నడ యాక్టర్ అరెస్ట్..
Chetan Kumar
Follow us
Venkata Chari

|

Updated on: Mar 22, 2023 | 4:18 AM

హిందుత్వంపై అభ్యంతరకర ట్వీట్ చేశాడంటూ కన్నడ యాక్టర్ చేతన్ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. చేతన్ అహింసగా కూడా యాక్టర్‌ను బెంగళూరులో శేషాద్రిపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అవాస్తవాలే పునాదిగా హిందుత్వ నిర్మించబడిందని ట్వీట్ చేశారంటూ హిందుత్వ అనుకూల సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ ట్వీట్ హిందువుల మనోభావాలను దెబ్బతీసిందంటూ కంప్లైంట్‌లో వివరించారు. దీని ఆధారంగా కేసు ఫైల్ చేశారు పోలీసులు. మత విశ్వాసాలను అవమానించారని, కొన్ని వర్గాల మధ్య వైషమ్యాలు తలెత్తేలా ఆయన ట్వీట్ ఉందనే అభియోగాలు ఎదుర్కొంటున్నారు చేతన్ కుమార్. రావణుడిని రాముడు ఓడించి అయోధ్యకు తిరిగి వచ్చిన తర్వాతే భారత జాతి అనేది మొదలైందని సావర్కర్ చెప్పారనేది ఒక అబద్ధం అంటూ చేతన్‌ తన ట్వీట్‌లో వివరించాడు.

బాబ్రీ మసీదే రాముడి జన్మస్థలం అని పేర్కొనడం అబద్ధం అంటూ స్పష్టం చేశాడు. ఇప్పుడు టిప్పును అంతమొందించింది ఉరిగౌడా, నంజెగౌడాలు అని చెప్పేదీ అబద్ధమే అంటూ కామెంట్ చేశాడు. ఇవన్నీ అబద్ధాలే అంటూ ట్వీట్ చేసిన చేతన్‌ హిందుత్వను కేవలం నిజం మాత్రమే ఓడించగలదు, ఆ నిజం సమానత్వం అంటూ వివరించాడు. ట్వీట్ చేయగానే గంటల వ్యవధిలోనే హిందుత్వ అనుకూల సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. చేతన్ కుమార్ గతంలోనూ చట్టపరమైన సమస్యల్లో చిక్కుకున్నారు. గత ఏడాది ఫిబ్రవరిలో కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి క్రిష్ణ దీక్షిత్ పై చేసిన అభ్యంతరకర ట్వీట్ కారణంగా అరెస్టు అయ్యాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..