- Telugu News Photo Gallery Cricket photos Sunil Narine picks 7 wickets for 0 runs in club Cricket game ahead of IPL 2023
Sunil Narine: 7 ఓవర్లు.. 7 మెయిడెన్లు.. 7 వికెట్లు.. ఐపీఎల్‌కి ముందే స్పిన్‌తో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్న వెస్టిండీస్ స్పిన్నర్..
ఐపీఎల్ ప్రారంభానికి ఇంకా రోజులే మిగిలి ఉండగానే సునీల్ నరైన్ స్పిన్ ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ఎందుకంటే ఈ విండీస్ స్పిన్ మాంత్రికుడు.. ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా 7 ఓవర్లు వేసి 7 వికెట్లు పడగొట్టాడు. ఇక..
Updated on: Mar 21, 2023 | 7:20 AM

ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా 7 ఓవర్లలో 7 వికెట్లు తీయడం సాధ్యమేనా..? వెస్టిండీస్ స్పిన్ మాంత్రికుడు సునీల్ నరైన్ క్రికెట్ మైదానంలో అసాధ్యమైన ఈ ప్రదర్శనను చేసి చూపించాడు.

T&T బోర్డ్ ప్రీమియర్‌షిప్ డివిజన్ I టోర్నమెంట్ వెస్టిండీస్‌లోని పోర్ట్-ఆఫ్-స్పెయిన్‌లో జరుగుతోంది. ఈ టోర్నమెంట్‌లో క్వీన్స్ పార్క్ క్రికెట్ క్లబ్ తరపున ఆడిన సునీల్ నరైన్ ఏడు మెయిడిన్ ఓవర్లు వేసి 7 వికెట్లు పడగొట్టాడు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన క్లార్క్ రోడ్ యునైటెడ్ మంచి బ్యాటింగ్ ప్రదర్శన కనబరుస్తుందని అంతా భావించారు. కానీ సునీల్ నరైన్ తన స్పిన్‌తో అటాక్ చేసిన కారణంగా ఆ జట్టు లెక్కలు తలకిందులయ్యాయి.

తొలి ఓవర్‌లోనే జాన్ రస్ జగ్గేసర్, సియాన్ హాకెట్‌ల వికెట్ తీసిన నరైన్, ఆ తర్వాత డిజోర్న్ చార్లెస్, నికోలస్ సూక్‌డిసింగ్, జాషువా పెర్సాద్‌లను పెవిలియన్‌కు పంపాడు. దీని తర్వాత అతను మరో రెండు వికెట్లు తీయడం ద్వారా 7 మెయిడిన్ ఓవర్లలో 7 వికెట్లు సాధించాడు.

సునీల్ నరైన్ స్పిన్ ధాటికి చతికిలబడ్డ క్లార్క్ రోడ్ యునైటెడ్ కేవలం 24 ఓవర్లలో 76 పరుగులకే ఆలౌటైంది. ఈ 7 వికెట్లతో పాటు సునీల్ నరైన్ ఈ టోర్నీలో వరుసగా 4వ సారి 5 వికెట్లు తీసి ప్రత్యేక రికార్డు కూడా సృష్టించాడు.

ఐపీఎల్ ప్రారంభానికి ఇంకా రోజులే మిగిలి ఉండగానే సునీల్ నరైన్ స్పిన్ ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ఎందుకంటే నరైన్ ఈసారి కూడా కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో ఉన్నాడు. ఇక ఈ విండీస్ స్పిన్ మాంత్రికుడు.. భారత్‌లోని స్పిన్ పిచ్‌లపై ఇదే తరహాలో మ్యాజిక్ చేస్తాడని అంతా భావిస్తున్నారు. కాగా, కోల్‌కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ 2023 ట్రోర్నీలో తన తొలి మ్యాచ్‌ను ఏప్రియల్ 2న పంజాబ్ కింగ్స్‌తో ఆడబోతుంది.





























