Swapnalok fire: అప్పుడు స్వప్నలోకం.. ఇప్పుడు శ్మశాన నిశ్శబ్దం..అయోమయంలో వేలమంది భవిష్యత్తు..

వందేళ్ల పాటు భేషుగ్గా బతకాల్సిన బిల్డింగ్ ఇది. వేలాది కుటుంబాలను అంతకంటే భేషుగ్గా బతికించాల్సిన స్వప్నలోకం అది. కానీ దీని తలుపులు ఎప్పుడు తెరుచుకుంటాయి? తమ కొలువులకు తలుపులు తిరిగి ఎప్పుడు తీస్తారు? ఇదే వేలాది ఉద్యోగులను ఇప్పుడు నిత్యం వేధిస్తున్న ప్రశ్న.

Swapnalok fire: అప్పుడు స్వప్నలోకం.. ఇప్పుడు శ్మశాన నిశ్శబ్దం..అయోమయంలో వేలమంది భవిష్యత్తు..
Swapnalok Fire Accident
Follow us
Jyothi Gadda

|

Updated on: Mar 21, 2023 | 7:25 PM

నిత్యం వేలాదిమంది ఉద్యోగులు, వ్యాపారులతో కళకళలాడే స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌ ఇప్పుడు కళ తప్పి వెలవెలబోతోంది. అగ్నిప్రమాదం ఆరుగురిని బలి గొన్న తర్వాత భవనానికి తాళాలు పడ్డాయి. ఇప్పుడు చిరుద్యోగులు, చిరు వ్యాపారులు, చిన్న కంపెనీల పరిస్థితి అయోమయం గందరగోళంగా మారింది. ఎవరో జ్వాలను రగిలించారు…వేరెవరో దానికి బలి అయినారు అన్నట్టు…అగ్ని ప్రమాదం ఉద్యోగులు, వ్యాపారుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చేసింది. రెండు ఫ్లోర్లలో ప్రమాదం జరిగితే టోటల్ బిల్డింగ్‌కి మూతేసి వెళ్లిపోతే… మిగతా వాళ్ల బతుకేం గాను…? మూతబడి వారం దాటిపోయింది.. ఇప్పటికీ ఎటూ తేలకపోవడంతో… అక్కడ షాపుల్లో పనిచేసే వేలాది మందికి దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది. రోజూ రావడం, స్వప్నలోక్‌ బిల్డింగ్‌ వంక చూసి దీర్ఘంగా నిట్టూర్చడం…ఏం చేయాలిరా దేవుడా అనుకుంటూ వాపోవడం…ఇదీ ఆ కాంప్లెక్స్‌ మీద ఆధార పడి బతుకుతున్న వాళ్ల నడుస్తున్న చిత్రం…గాయపడిన గతం తాలూకూ వర్తమాన విషాదం ఇదీ. ఇప్పుడు జేఎన్‌టీయూ రిపోర్ట్‌ మీదే తమ బతుకులు ఆధార పడ్డాయని వాపోతున్నారు. స్వప్నలోక్‌ తిరిగి ఓపెన్‌ అయ్యేలా ప్రభుత్వం త్వరగా చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.

చూస్తుండగానే వారం రోజులు దాటిపోయాయి. స్వప్నలోక్ తలుపులు మూసినవి మూసినట్టే ఉన్నాయి. ఇలాగే కాలం వెళ్లదీస్తుంటే… ఈ కాంప్లెక్స్‌నే నమ్ముకుని దీన్నే జీవనాధారం అనుకున్న మా బతుకులు ఏంగాను…? అని వాపోతున్నారు వేలాదిమంది స్వప్నలోక్ బాధితులు. పాపం ఎవరిదైతేనేం… దాని ఫలితం మాత్రం వీళ్లది. ప్రమాదం జరిగిన ఫ్లోర్‌లోనే ఉన్న మరి కొన్ని చిన్నచిన్న కంపెనీల పరిస్థితి మరీ అగమ్యగోచరం. కంప్యూటర్లు, డాక్యుమెంట్లు కాలి బూడిదైపోయాయి. ప్రమాదం జరగని మిగతా ఫ్లోర్లలో కంపెనీలకు కూడా తాళాలు పడిపోవడంతో వాళ్ల గోడు వినేవాళ్లు లేనే లేరక్కడ. ప్రభుత్వం ఎప్పుడు పర్మిషన్‌ ఇస్తుందా, స్వప్నలోక్‌ తలుపులు ఎప్పుడు తెరుచుకుంటాయా అని ఉద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్నారు.

వందేళ్ల పాటు భేషుగ్గా బతకాల్సిన బిల్డింగ్ ఇది. వేలాది కుటుంబాలను అంతకంటే భేషుగ్గా బతికించాల్సిన స్వప్నలోకం అది. కానీ దీని తలుపులు ఎప్పుడు తెరుచుకుంటాయి? తమ కొలువులకు తలుపులు తిరిగి ఎప్పుడు తీస్తారు? ఇదే వేలాది ఉద్యోగులను ఇప్పుడు నిత్యం వేధిస్తున్న ప్రశ్న.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే