Jyothi Gadda |
Updated on: Mar 21, 2023 | 6:18 PM
దాదాపు అందరి ఇళ్లలోనూ ఫ్రిజ్ ఉంటుంది. అయితే ఈ ఫ్రిజ్‌ను గోడకు ఎంత దూరంలో ఉంచాలో తెలుసా..? అసలు దాని గురించి ఎప్పుడైనా ఆలోచించరా..?
నేటి కాలంలో రిఫ్రిజిరేటర్ దాదాపు ప్రతి ఇంట్లో కనిపిస్తుంది. కొంతమంది ఫ్రిజ్‌ని హాల్‌లో ఉంచుతారు. మరికొందరు వంటగదిలో ఉంచుతారు. కిచెన్ లేదా హాల్‌లో ఎంత స్థలం అందుబాటులో ఉందో కూడా ఫ్రిజ్ ఉంచే స్థలం ఆధారపడి ఉంటుంది.
నిపుణుల సూచన మేరకు ఫ్రిజ్ గోడకు 6-10 అంగుళాల దూరంలో ఉంచాలి. ఏ ఫ్రిజ్ అయినా లోపల నుండి చల్లగా ఉండటానికి చాలా టైమ్‌పడుతుంది. ఈ శీతలీకరణ ప్రక్రియలో, గ్రిల్ ద్వారా లోపల నుండి వేడి విడుదల అవుతుంది. ఫ్రిజ్‌ను నేరుగా గోడకు కనెక్ట్ చేయకపోవడానికి ఇదే కారణం.
మీరు రిఫ్రిజిరేటర్‌ను పూర్తిగా గోడకు ఆనుకుని ఉంచినట్లయితే, వేడి గాలి సరిగా బయటకు రాదు. ఫ్రిజ్‌ను లోపలి నుండి చల్లబరచడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇది మీ జేబుకు కూడా చిల్లుపెడుతుంది. ఎందుకంటే ఇది ఎక్కువ కరెంట్ ఖర్చు అవుతుంది.
మీరు ఫ్రిజ్‌ను గోడ నుండి 6-10 అంగుళాల దూరంలో ఉంచాలి. అయితే ఇది కాకుండా మీరు ఫ్రిజ్‌ను నేరుగా హీటర్ లేదా ఇతర వేడిని ఉత్పత్తి చేసే వస్తువలకు దగ్గర ఉంచకూడదని గుర్తుంచుకోండి. దీనికి కారణం ఎంటో తెలుసుకుందాం..
మీరు ఇలా చేస్తే, అప్పుడు ఉష్ణోగ్రతలో చాలా తేడా ఉంటుంది. ఫ్రిజ్ గోడకు గానీ, ఇతర వేడి సాధనాలకు గానీ, దగ్గర ఉంటే, మీ ఫ్రిజ్ లోపలి నుండి తడిగా ఉండటం ఐస్ తయారవుతుంది. అలా జరిగితే మీ ఫ్రిజ్‌లో పదార్థాలు కూడా పాడయ్యే ప్రమాదం ఉంది.