AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TS Govt Jobs: నిరుద్యోగులకు మరో గుడ్‌న్యూస్‌.. జీహెచ్‌ఎంసీ పరిధిలో 1,540 ఆశావర్కర్‌ పోస్టులు

తెలంగాణలో రాష్ట్రంలోని జీహెచ్‌ఎంసీ పరిధిలో నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్ర సర్కార్‌ తీపికబురు అందించింది. మరో 1,540 పోస్టుల భర్తీకి మంగళవారం (మార్చి 21) ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు..

TS Govt Jobs: నిరుద్యోగులకు మరో గుడ్‌న్యూస్‌.. జీహెచ్‌ఎంసీ పరిధిలో 1,540 ఆశావర్కర్‌ పోస్టులు
TS Asha Worker Posts
Srilakshmi C
|

Updated on: Mar 21, 2023 | 7:45 PM

Share

తెలంగాణలో రాష్ట్రంలోని జీహెచ్‌ఎంసీ పరిధిలో నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్ర సర్కార్‌ తీపికబురు అందించింది. మరో 1,540 పోస్టుల భర్తీకి మంగళవారం (మార్చి 21) ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు హైదరాబాద్‌, మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లాల్లో ఆశావర్కర్‌ పోస్టులను భర్తీ చేయనున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి ఎస్‌ఏఎం రిజ్వీ ఓ ప్రకటనలో తెలిపారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు ట్విటర్‌లో పోస్టు చేశారు. సీఎం కేసీఆర్‌ సారథ్యంలో రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ బలోపేతానికి మరో అడుగు పడినందుకు మంత్రి మరీశ్‌ హర్షం వ్యక్తం చేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 1,540 మంది ఆరోగ్య సంరక్షణ కార్యకర్తల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు ఆయన తన పోస్టులో పేర్కొన్నారు.

కాగా రిజ్వీ తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. హైదరాబాద్‌లో 323 పోస్టులు, మేడ్చల్‌ జిల్లాలో 974 పోస్టులు, రంగారెడ్డి జిల్లాలో 243 ఆశావర్కర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులన్నింటినీ కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం జిల్లా నియామక కమిటీల ద్వారా భర్తీ చేస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.