AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ugadi 2023: 30 ఏళ్ల తర్వాత వచ్చిన ప్రత్యేక ఉగాది.. ఆ రాశుల వారికి అదృష్టం, ఊహించని ధనలాభం..!

ఏదైన అడ్డంకులు, సమస్యలతో బాధపడేవారికి ఈ క్రమంలో ఉపశమనం లభిస్తుంది. వృత్తి జీవితంలో శత్రువులు ఆధిపత్యం వహించలేరు. విద్యారంగంలో మంచి విజయాలు పొందే ఛాన్స్ ఉంది.

Ugadi 2023: 30 ఏళ్ల తర్వాత వచ్చిన ప్రత్యేక ఉగాది.. ఆ రాశుల వారికి అదృష్టం, ఊహించని ధనలాభం..!
Ugadi
Jyothi Gadda
|

Updated on: Mar 21, 2023 | 5:33 PM

Share

హిందూ నూతన సంవత్సరం చైత్ర మాసంలో శుక్ల పక్షంతో ప్రారంభమవుతుంది. ఈసారి చైత్ర శుక్ల పక్షం మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. కాబట్టి ఈ రోజున ఉగాది పండుగ జరుపుకుంటారు. అంతేకాదు ఈ రోజులను చైత్ర నవరాత్రులు అని కూడా అంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఉగాది రోజు కొన్ని గ్రహాల సంచారం కారణంగా 4 రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఏ రాశి వారికి లాభమో ఇప్పుడు తెలుసుకుందాం.

అన్ని రాశులవారిపై కొత్త సంవత్సరం ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది. దీని కారణంగా అన్ని రాశులవారి జీవితాల్లో అనేక మార్పులు సంభవిస్తాయి. ఈ యేడు ఉగాది మరో పత్యేకత ఏంటంటే.. 30 ఏళ్ల తర్వాత ఈసారి కుంభరాశిలో శని సంచరిస్తున్నాడు. రాహువు, శుక్రుడు మేషరాశిలో, కేతువు తులారాశిలో, కుజుడు మిధునరాశిలో సంచరిస్తున్నారు.

ధనుస్సు:

ధనుస్సు రాశి వారికి ఉగాది శుభప్రదం, ఫలప్రదం ఉంటుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఇది ధనుస్సు రావివారి అదృష్టాన్ని అమాంతంగా పెంచేస్తుంది. అదనంగా, వ్యాపార కోణం నుండి అనేక రకాల ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. మీరు స్నేహితులతో కలిసి సంతోష సమయాన్ని గడపడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ రాశి వారికి కొత్త ఉద్యోగాలు లభిస్తాయి.

ఇవి కూడా చదవండి

తుల రాశి :

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం..ఈ రాశి వారికి ఈ సమయం చాలా అనుకూలంగా మారబోతోంది. ఏదైన అడ్డంకులు, సమస్యలతో బాధపడేవారికి ఈ క్రమంలో ఉపశమనం లభిస్తుంది. వృత్తి జీవితంలో శత్రువులు ఆధిపత్యం వహించలేరు. విద్యారంగంలో మంచి విజయాలు పొందే ఛాన్స్ ఉంది.

సింహం:

చైత్ర శుక్ల ప్రారంభంలో సింహ రాశి వారికి విశేష ప్రయోజనాలు లభిస్తాయి. ఈ రాశివారు పూర్వీకుల ఆస్తి పొందడమేకాకుండా చాలా రకాల ప్రయోజనాలు పొందుతారు. అంతేకాకుండా ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి. ఈ సమయంలో కుటుంబ సభ్యుల నుంచి సహాయ, సహకారాలు లభిస్తాయి. దాంతో మరిన్ని విశేష ప్రయోజనాలు పొందే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఈ క్రమంలో సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

మిథునం:

కొత్త సంవత్సరంలో మిథునరాశి వారి జీవితాలపై ప్రభావం పడనుంది. ఈ రాశుల వ్యక్తులు జీవితంలో మంచి ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా ఉద్యోగ రంగంలో ఉన్న వ్యక్తులకు ప్రమోషన్స్‌ కూడా లభిస్తాయి. అంతేకాకుండా వ్యాపారంలో ఈ రాశివారు విజయాలు సాధించి భారీ లాభాలు పొందుతారు. ముఖ్యంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి మంచి ఉపశమనం లభిస్తుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం..