AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu tips: చీపురు విషయంలో ఈ చిన్నపొరపాటు.. మీ జీవితంలో దరిద్రానికి దారులు తీస్తుంది..! ధననష్టం తప్పదు..!!

పాడైన చీపురుతో ఇళ్లు శుభ్రం చేస్తే..చాలా సమస్యలు ఎదురవుతాయని నమ్ముతారు. దీనివల్ల ఆ వ్యక్తి ఆర్ధిక ఇబ్బందుల్ని ఎదుర్కోవల్సి వస్తుంది. పాత చీపురును తీసేసి..

Vastu tips: చీపురు విషయంలో ఈ చిన్నపొరపాటు.. మీ జీవితంలో దరిద్రానికి దారులు తీస్తుంది..! ధననష్టం తప్పదు..!!
Broom
Jyothi Gadda
|

Updated on: Mar 21, 2023 | 4:59 PM

Share

వాస్తుశాస్త్రం ప్రకారం చీపురు లక్ష్మీదేవికి ప్రతిరూపంగా భావిస్తారు. అదేవిధంగా వాస్తు శాస్త్రంలో చీపురుకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. చీపురు ఇంట్లోని మురికి, చెత్తను తొలగించడానికి మాత్రమే ఉపయోగించే వస్తువు కాదు.. ఇది ఇంటికి పట్టిన దరిద్రాన్ని కూడా తొలగించగల శక్తి కలిగినది.. ఇంట్లో చీపురు విషయంలో కొన్ని నియమాలు కూడా వాస్తు శాస్త్రంలో ప్రస్తావించబడ్డాయి. ఈ నియమాల్ని పాటించకపోతే.. ఆ ఇంట్లో దారిద్ర్యం తాండవిస్తుందట.. ఇంట్లో చీపురు ఉంచే విషయంలో సూచించబడిన నియమాల్ని పాటించకపోతే.. లక్ష్మీదేవి ఆ ఇంట్లోంచి వెళ్లిపోతుంది. దాంతో ఆ ఇంటిల్లిపాదికి కష్టాలు తప్పవు.. ఆ నియమాలేంటో పరిశీలిద్దాం..

వాస్తు ప్రకారం చీపురుని ఎప్పుడూ నిలబెట్టి ఉంచకూడదు. నిలబెట్టి ఉంచే చీపురు అశుభంగా భావిస్తారు. అందుకే చీపురును ఎప్పుడూ పడుకోబెట్టి ఉంచాలి. చీపురును ఎప్పుడూ కిచెన్ లో ఉంచకూడదంట. కిచెన్‌లో చీపురుంచడం వల్ల ఇంట్లో అన్నం కొరత ఏర్పడుతుందని వాస్తుశాస్త్రం చెబుతోంది. దాంతో పాటు ఇంటి కుటుంబసభ్యుల ఆరోగ్యంపై కూడా ప్రభావం పడుతుంది. వాస్తు పండితుల ప్రకారం..ఇంట్లో చీపురుని డబ్బులు దాచినట్టే దాచి ఉంచాలి. బహిరంగంగా ఉంచడం అశుభంగా భావిస్తారు. అందరి దృష్టీ అటే వెళ్తుంది. ఇతరుల దృష్టి పడనిచోట ఇంట్లో చీపురు ఉంచాలంటారు. బహిరంగంగా ఉంచితే ఆ ఇంట్లోని పాజిటివ్ ఎనర్జీని ఆ చీపురు దూరం చేస్తుందని చెబుతారు. వాస్తు నిపుణుల సూచన మేరకు.. చీపురు ఎప్పుడూ దక్షిణ దిశలోనే ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఎప్పుడూ దారిద్య్రం తొలగిపోయి, ఆనందం వర్ధిల్లుతుంది.

చీపురును లక్ష్మీదేవికి రూపంగా భావిస్తారు. సాయంత్రం సమయంలో చీపురుతో ఊడవటం చేయకూడదు. లక్ష్మీదేవికి కోపం వస్తుందని చెబుతారు. సూర్యాస్తమయం తరువాత ఏదైనా కారణంతో చీపురుతో ఊడవాల్సి వస్తే..మట్టి, చెత్తను ఇంట్లోనే ఉంచుకోవాలి. బయట పారవేయకూడదు. లేకపోతే లక్ష్మీదేవి ఆ ఇంటి నుంచి వెళ్లిపోతుందని అంటారు. చీపురును నార్త్‌ఈస్ట్‌లో పొరపాటున కూడా ఉంచకూడదు. అలా చేస్తే పెద్ద తప్పిదమే అవుతుంది. ఆ ఇంట్లోకి సంపద రాదంట. అందుకే చీపురుని పశ్చిమం లేదా దక్షిణ దిశలోనే ఉంచాలి. చీపురు పాడైతే వెంటనే కొత్తది మార్చేయాలి. పాడైన చీపురుతో ఇళ్లు శుభ్రం చేస్తే..చాలా సమస్యలు ఎదురవుతాయని నమ్ముతారు. దీనివల్ల ఆ వ్యక్తి ఆర్ధిక ఇబ్బందుల్ని ఎదుర్కోవల్సి వస్తుంది. పాత చీపురును తీసేసి..శనివారం నాడు ఇంట్లోకి కొత్త చీపురు తెచ్చుకోవాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని వాస్తు సంబంధిత వార్తల కోసం..