AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమెరికా ప్రభుత్వంలో మరో భారత సంతతి మహిళకు కీలక బాధ్యతలు.. బైడెన్ ఆదేశాలు జారీ..

అగ్రరాజ్యం అమెరికా ప్రభుత్వంలో మరో భారత సంతతి వ్యక్తికి కీలక పదవి దక్కింది. అమెరికా ఫైనాన్స్ ఏజెన్సీ ... ఈ మేరకు వైట్ హౌస్ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది.

అమెరికా ప్రభుత్వంలో మరో భారత సంతతి మహిళకు కీలక బాధ్యతలు.. బైడెన్ ఆదేశాలు జారీ..
Nisha Desai Biswal
Jyothi Gadda
|

Updated on: Mar 21, 2023 | 2:46 PM

Share

అగ్రరాజ్యం అమెరికా ప్రభుత్వంలో మరో భారత సంతతి వ్యక్తికి కీలక పదవి దక్కింది. అమెరికా ఫైనాన్స్ ఏజెన్సీ డిప్యూటీ చీఫ్‌గా భారత సంతతికి చెందిన నిషా దేశాయ్ బిస్వాల్‌ను అధ్యక్షుడు జో బిడెన్ నామినేట్ చేశారు. ఈ మేరకు వైట్ హౌస్ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. 2013 నుండి 2017 వరకు యుఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసిన బిస్వాల్, యుఎస్-ఇండియా సంబంధాలను మెరుగుపరచడంలో ప్రధాన పాత్ర పోషించారు. భారత సంతతికి చెందిన నిషా దేశాయ్ బిస్వాల్‌ను అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ అమెరికా ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కమిషన్‌లో అత్యున్నత పరిపాలనా స్థానానికి నామినేట్ చేసినట్లు వైట్ హౌస్ సోమవారం ప్రకటించింది.

ఒబామా హయాంలోనూ బిస్వాల్ కీలక బాధ్యతలు నిర్వహించారు. అప్పట్లో ఆమె దక్షిణ, మద్య ఆసియా వ్యవహారాలకు సంబంధించి అసిస్టెంట్ సెక్రెటరీ ఆఫ్ స్టేట్‌గా పనిచేశారు. విదేశాంగ విధానం, అంతర్జాతీయ అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణలో ఆమె 30 ఏళ్లకు పైగా అనుభవం గడించారు. ప్రస్తుతం బిస్వాల్.. అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్ నేతృత్వంలోని ఇంటర్నేషనల్ స్ట్రాటజీర, గ్లోబల్ ఇనీషియేటివ్స్ కార్యక్రమానికి సీనియర్ ఉపాధ్యక్షురాలిగా వ్యవహరిస్తుననారు. అంతేకాకుండా.. ఇండియా, బాంగ్లాదేశ్‌లకు సంబంధించి యూఎస్ బిజినెస్ కౌన్సిళ్లకూ నేతృత్వం వహిస్తున్నారు.

బిస్వాల్ US ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ (USAID)లో ఆసియాకు అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటర్‌గా కూడా పనిచేశారు. దక్షిణ, మధ్య మరియు ఆగ్నేయాసియా అంతటా USAID కార్యక్రమాలు పరిశీలించబడ్డాయి. నిషా చాలా రోజులు ఢిల్లీలో కూడా పని చేసింది. అతను స్టేట్ అండ్ ఫారిన్ ఆపరేషన్స్ సబ్‌కమిటీలో స్టాఫ్ డైరెక్టర్‌గా, ఫారిన్ అఫైర్స్ కమిటీ సభ్యురాలిగా కూడా పనిచేశారు.. యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియాలో గ్రాడ్యుయేట్ అయిన బిస్వాల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఎకనామిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీని పొందారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..