AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బీజేపీపై అమెరికా మీడియా ప్రశంసలు.. ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన పొలిటికల్ పార్టీ‌గా కితాబు!

Wall Street Journal report: 2024లో కూడా ప్రధాని నరేంద్ర మోడీ అధికారంలోకి వస్తాడు అని బహుశా అమెరికా ఫిక్స్ అయిపోయినట్లే ఉంది.

బీజేపీపై అమెరికా మీడియా ప్రశంసలు.. ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన పొలిటికల్ పార్టీ‌గా కితాబు!
Bjp Modi
Balaraju Goud
|

Updated on: Mar 21, 2023 | 3:08 PM

Share

2024లో కూడా ప్రధాని నరేంద్ర మోడీ అధికారంలోకి వస్తాడు అని బహుశా అమెరికా ఫిక్స్ అయిపోయినట్లే ఉంది. ఎందుకంటే, 2014 నుండి ఎప్పుడూ ఘాటుగా విమర్శలు చేసే అమెరికా మీడియా కూడా ఈ మధ్య స్వరం మార్చింది. బిజెపి ప్రభుత్వం మీద ఈ మధ్య అనుకూల వ్యాసాలు రాస్తోంది. ఇంకా చెప్పాలి అంటే గతంలో ఎక్కువగా భారతీయ జర్నలిస్టుల బిజెపి వ్యతిరేక వ్యాసాలు వస్తూ ఉంటే ఇప్పుడు అమెరికన్ కాలమిస్టుల రాస్తున్న అనుకూల వ్యాసాలు వస్తున్నాయి.

ఈ మధ్యే ‘ ద ఎకనమిస్ట్’ లో వ్యాసం వచ్చిన తరువాత ఈ కోవలెనే తాజాగా ‘వాల్ స్ట్రీట్ జర్నల్’ లో సీనియర్ కాలమిస్ట్ వాల్తేర్ రస్సెల్ మీడ్ బిజెపి మీద ఒక వ్యాసం రాశారు. ప్రపంచంలోనే భారతీయ జనతా పార్టీ అత్యంత ముఖ్యమైన విదేశీ రాజకీయ పార్టీ అని వాల్ స్ట్రీట్ జర్నల్‌ కథనంలో పేర్కొంది. వరుసగా 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన ఆ పార్టీ.. 2024లోనూ విజయాన్ని అందుకునే దిశగా ముందుకు వెళ్తోందని రాసుకొచ్చింది. ఇండో-పసిఫిక్‌లో జపాన్‌తో కలిసి ప్రబల ఆర్థిక శక్తిగా ఎదుగుతోందని.. రాబోయే కాలంలో పెరుగుతున్న చైనా ప్రాబల్యాన్ని అడ్డుకోడానికి అమెరికాకు భారత్ సహాయం ఎంతో అవసరమని వెల్లడించింది.

భారతీయులు రాజకీయంగా, సాంస్కృతికంగా అభివృద్ధి చెందుతుందోని రచయిత మీడ్ అభిప్రాయపడ్డారు. జాతీయ పునరుద్దరణలో భాగంగా ఆధునీకరణకు విలక్షణమైన ‘హిందూ మార్గాన్ని’ రూపొందించడానికి అనేక తరాలుగా సామాజికవేత్తలు, కార్యకర్తలు చేసిన ప్రయత్నాల ఆధారంగా ఎన్నికల్లో ఆ పార్టీ ఆధిపత్యం చెలాయిస్తోందని వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొన్నారు. చైనా కమ్యూనిస్ట్ పార్టీ మాదిరిగా బిలియన్ కంటే ఎక్కువ మంది జనాభా ఉన్న భారత్ ప్రపంచ సూపర్ పవర్‌గా ఎదగాలని భావిస్తోంది. ఇజ్రాయేల్‌లోని లికుడ్ పార్టీ మాదిరిగానే బీజేపీ కూడా ప్రజాదరణ పొందిన వాక్చాతుర్యం, సంప్రదాయవాద విలువలతో మార్కెట్ అనుకూల ఆర్థిక వైఖరిని మిళితం చేస్తోంది’ అని మిడ్ తన వ్యాసంలో అభిప్రాయపడ్డారు.

బీజేపీ కేవలం హిందువులకే కాకుండా, ఇతర వర్గాలకూ దగ్గరవుతున్న అంశాన్ని వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రిక తన కాలమ్ లో ప్రస్తావించింది. క్రిస్టియన్ జనాభా అధికంగా ఉన్న ఈశాన్య రాష్ట్రాల్లో ఇటీవల సాధించిన ఫలితాలు, 20 కోట్ల జనాభా ఉన్న యూపీలో బీజేపీకి షియా ముస్లింల మద్దతును గుర్తు చేసింది. కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాటంలో ఆర్ఎస్ఎస్ ముఖ్య పాత్ర పోషించినట్టు పేర్కొంది.

బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌తో సంబంధాల కోసం వచ్చిన ఆహ్వానాన్ని అమెరికన్లు తిరస్కరించలేరు. చైనాతో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో అమెరికాకు ఆర్థిక, రాజకీయ భాగస్వామిగా భారత్ అవసరం.. హిందూ జాతీయవాద ఉద్యమం భావజాలం, క్రమాన్ని అర్థం చేసుకోవాలని మిడ్ అభిప్రాయపడ్డారు. భారతదేశంతో ఆర్థికంగా నిమగ్నమవ్వాలని కోరుకునే వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులకు ఎంత ముఖ్యమో… వ్యూహాత్మక సంబంధాన్ని స్థిరంగా ఉంచాలనుకునే దౌత్యవేత్తలు, విధాన రూపకర్తలకు కూడా అంతే ముఖ్యం’ అని వాల్ స్ట్రీట్ జర్నల్ కథనంలో మీడ్ పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..