AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: గాడిదకేం తెలుసు అనుకోవద్దు..! మధుర స్వరంతో గొంతెత్తి పాడుతుంది తియ్యగా..!!

గాడిద అలా శబ్దం చేయడం దానికదే ప్రత్యేకత. ఈ వీడియో చూసి అందరూ షాక్ అవుతున్నారు. ఈ వీడియోపై చాలా మంది యూజర్లు తమ రియాక్షన్స్ పంచుకుంటున్నారు.

Watch Video: గాడిదకేం తెలుసు అనుకోవద్దు..! మధుర స్వరంతో గొంతెత్తి పాడుతుంది తియ్యగా..!!
Donkey Beautifal Voice
Jyothi Gadda
|

Updated on: Mar 21, 2023 | 2:24 PM

Share

సోషల్ మీడియా ప్రపంచంలో అన్ని వింతలు, విశేషాలే.. ఎప్పుడు ఎలాంటి వార్త వైరల్‌ అవుతుందో ఎవరికీ తెలియదు… ఒక్కోసారి మనల్ని మనమే నమ్మలేని విషయాలకు సంబంధించిన వీడియోలు చాలాసార్లు కనిపిస్తున్నాయి. అలాంటి వీడియో ఒకటి తాజాగా నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన తర్వాత బహుశా మీరు కూడా అది నిజమంటే నమ్మలేరు. మీరు ఎప్పుడైనా గాడిద మధురమైన స్వరం విన్నారా? ఖచ్చితంగా లేదనే అంటారు. ఎందుకంటే, గాడిద గాండ్రీంపు ఎవ్వరికీ నచ్చదు. కానీ, ఈ గాడిద ఎప్పటి నుండి మధురమైన శబ్దాలు చేయడం ప్రారంభించిందో తెలియదు గానీ, వినడానికి మాత్రం చాలా వింతగా ఉంది.

కోకిల కమ్మని రాగం తీస్తుంది. నెమల్లి వయ్యారంగా నృత్యం చేస్తుంది. కుక్కలు మొరుగుతాయి. కానీ, గాడిదల అరుపు మాత్రం చెవిన పడగానే చిరాకుపుడుతుంది. అలాంటిది ఒక గాడిద మధురమైన స్వరంతో తియ్యగా పాడుతోంది. ఈ వీడియో చూస్తే.. ఇంతవరకు మనం అనుకున్న అన్ని భ్రమలను బద్దలు కొట్టేస్తుంది. ఈ వీడియోలో గాడిదను చూసి మీరు కూడా గందరగోళానికి గురవుతారు. ఈ వీడియోలో మనకు ముందుగా ఒక గాడిద కనిపిస్తుంది. అది ఏదో చెప్పాలనుకుంటున్నట్లుంది. తర్వాత వీడియోలో గాడిద శబ్దాలు చేయడం ప్రారంభిస్తుంది. ఈ వాయిస్ విని మీరు ఆశ్చర్యపోతారు. గాడిద ఇలా శబ్దం చేయడం మీరు గతంలో ఎప్పుడూ వినుండరు. ఈ వీడియోలో గాడిద చాలా మధురమైన శబ్దం చేస్తుంది. గాడిద అలా శబ్దం చేయడం దానికదే ప్రత్యేకత. ఈ వీడియో చూసి అందరూ షాక్ అవుతున్నారు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by UNILAD (@unilad)

వీడియోని ఇన్‌స్టాగ్రామ్ యూజర్ షేర్ చేశారు. ఈ వీడియోపై చాలా మంది యూజర్లు తమ రియాక్షన్స్ పంచుకుంటున్నారు. గాడిద చేసినది నిజంగా హృదయానికి హత్తుకునేలా ఉందని ఒక వినియోగదారు రాశారు. గాడిద కూడా పాడగలదంటూ ఒక వినియోగదారు ట్విట్‌ చేయగా, వెనుక నుండి మరొక ట్యూన్ అవసరమా అని మరొక వినియోగదారు రాశారు. ఈ వీడియోపై చాలా మంది వినియోగదారులు ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..