AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తవ్వకాల్లో భారీ బంగారు నిధి దొరికింది.. ఏకంగా 50 టన్నుల అసలైన గోల్డ్‌ గని.. ఎక్కడో తెలుసా..?

బంగారు గనిలో 50 టన్నుల బరువుతో ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు నిక్షేపాన్ని గుర్తించినట్టు అక్కడి మీడియా వెల్లడించింది. ఇది అసలైన మేలిమి బంగారంగా గుర్తించారు.

తవ్వకాల్లో భారీ బంగారు నిధి దొరికింది.. ఏకంగా 50 టన్నుల అసలైన గోల్డ్‌ గని.. ఎక్కడో తెలుసా..?
High Quality Gold Mine
Jyothi Gadda
|

Updated on: Mar 20, 2023 | 7:32 PM

Share

కోవిడ్ తర్వాత చైనా ఆర్థిక వ్యవస్థ అనేక కారణాల వల్ల కుప్పకూలుతోంది. ఈ నేప‌థ్యంలో చైనా త‌న దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను గాడిలో పెట్టుకునేందుకు డ్రాగ‌న్ నేష‌న్ చాలా ప్ర‌య‌త్నాలు చేస్తోంది. అలాంటి క్రమంలో ఇప్పుడు చైనాకు బంపర్ లాటరీ తగిలింది. లాటరీ ఏంటా అని ఆశ్చర్యపోతున్నారా..? అవును అలాంటిదే చైనాకు భారీ మొత్తంలో బంగారం నిధి దొరికింది. ఇది పూర్తిగా ఫ్యూర్‌ నాణ్యమైన గోల్డ్‌ అని తెలిసింది. అవును, తూర్పు చైనాలోని షాన్‌డాంగ్ ప్రావిన్స్‌లోని రుషాన్‌లోని జిలాకౌ బంగారు గనిలో 50 టన్నుల బరువుతో ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు నిక్షేపాన్ని చైనా గుర్తించినట్టు అక్కడి మీడియా వెల్లడించింది.

షాన్డాంగ్ ప్రావిన్షియల్ బ్యూరో ఆఫ్ జియాలజీ & మినరల్ రిసోర్సెస్ ప్రకారం, ఎనిమిది సంవత్సరాల నిరీక్షణ తర్వాత, జిలాకౌ బంగారు గని ఈ ప్రాంతంలో ఇప్పటివరకు అతిపెద్ద బంగారు నిక్షేపంగా ఉంది. 2023లో గుర్తించిన అతిపెద్ద బంగారం నిధి ఇదే. ఈ బంగారం విలువ ఎంతో తెలుసా..? దాదాపు 3 ట్రిలియన్ డాలర్లు. ప్రస్తుతం మార్కెట్ విలువ ప్రకారం 50 టన్నుల బంగారాన్ని విక్రయిస్తే 3 లక్షల కోట్ల డాలర్లు సంపాదించుకోవచ్చు.  అలాగే, ఈ ప్రాంతంలో గుర్తించిన బంగారం అధిక నాణ్యత కలిగిన గోల్డ్‌గా చెబుతారు. స్థానిక వనరుల శాఖ ప్రకారం, ఇక్కడ నిధిని సులభంగా తవ్వవచ్చు. అలాగే, ఈజీగా ప్రాసెస్ చేసే వీలుంటుంది.

ప్రాంతీయ భౌగోళిక రాజకీయ ప్రమాదాలు, ప్రపంచ ఆర్థిక మందగమనం మధ్య చైనా తన బంగారు నిల్వలు, ఉత్పత్తిని విస్తరిస్తోంది. ఫిబ్రవరి చివరి నాటికి చైనా బంగారం నిల్వలు 65.92 మిలియన్ ఔన్సులు (1,869 టన్నులు)గా ఉన్నాయి. అలాగే, చైనా సెంట్రల్ బ్యాంక్, పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా, జనవరి నుండి ఫిబ్రవరి వరకు సరఫరాలు 800,000 ఔన్సులు పెరిగాయని తెలిపింది. ఇప్పటికే, షాన్‌డాంగ్ చైనాలో అతిపెద్ద బంగారం ఉత్పత్తి చేసే ప్రాంతం, పెద్ద మొత్తంలో విలువైన లోహపు నిల్వలను కలిగి ఉంది.

ఇవి కూడా చదవండి

అలాగే, జియోజియా బంగారు గని గతేడాది 10 టన్నులకు పైగా బంగారాన్ని సమకూర్చుకుంది. దేశవ్యాప్తంగా ఇదే అత్యధిక ఉత్పత్తి అని చైనా గోల్డ్ అసోసియేషన్ (సీజీఏ) తెలిపింది. 2022లో చైనా ముడి బంగారం ఉత్పత్తి 372.05 టన్నులకు చేరుకుందని, 2021 నుంచి 13.09 శాతం పెరిగిందని జనవరి 19న CGA డేటా నివేదించింది. అయితే, చైనా బంగారం వినియోగం 2022లో 1,001.74 టన్నులుగా ఉంది. ఇది సంవత్సరానికి పెరుగుదల సీజీఏ కూడా 10.63 శాతం తగ్గినట్లు సమాచారం.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..