లండన్‌ ఎంబసీ ఘటన.. బీజేపీ నేత మంజీందర్‌ సింగ్‌ సీరియస్.. ప్రపంచవ్యాప్తంగా సిక్కులు ఏకం కావాలంటూ..

ప్రస్తుతం ఈ వీడియో వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్‌గా మారింది. అందులో ఓ ఖలిస్థాని మద్ధతుదారుడు ఇండియా హౌస్ భవనంపై ఎక్కి జతీయ జెండాను కిందకి లాగాడు.

లండన్‌ ఎంబసీ ఘటన.. బీజేపీ నేత మంజీందర్‌ సింగ్‌ సీరియస్.. ప్రపంచవ్యాప్తంగా సిక్కులు ఏకం కావాలంటూ..
Manjinder Singh Sirsa
Follow us
Jyothi Gadda

| Edited By: Ravi Kiran

Updated on: Mar 20, 2023 | 7:38 PM

London: లండన్​లో భారత జాతీయ జెండాకు జరిగిన అవమానంపై యావత్‌ భారతీయులు మండిపడుతున్నారు. ఇప్పటికే భారతీయ జెండాను అగౌరవపరచడంపై యూకే సీనియర్ దౌత్యవేత్తకు భారత ప్రభుత్వం సమన్లు జారీ చేసింది. దీనిపై వివరణ ఇచ్చి..బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేసింది. ఖలిస్థాన్ వేర్పాటు వాదులు..లండన్‌లో చేసిన ఈ పనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు భారత్ తెలిపింది. వెంటనే అక్కడి ప్రభుత్వం బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్‌ చేసింది. మరోవైపు బ్రిటిష్ హైకమిషన్ వద్ద సిక్కులు నిరసన తెలిపారు. త్రివర్ణ పతాకాన్ని, ప్లకార్డులను పట్టుకుని నిరసనకారులు ఆందోళన చేపట్టారు. ‘భారత్ హుమారా స్వాభిమాన్ హై ‘ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. భారత జాతీయ జెండాను అవమానిస్తే సహించేది లేదని హెచ్చరించారు. కాగా, లండన్‌ ఘటనపై సిక్కు వర్గాలు తీవ్ర ఆగ్రహం, అసహనం వ్యక్తం చేస్తున్నాయి.

లండన్ లోని ఇండియన్ హై కమిషన్ వద్ద జరిగిన ఘటన, ఖలిస్తానీ మద్దతుదారుల చర్యను ఖండిస్తూ భారతీయ జనతా పార్టీ (బిజెపి) నాయకుడు మంజీందర్ సింగ్ సిర్సా తీవ్రంగా స్పందించారు. ఇలాంటి చర్యలు ధైర్యం, దేశభక్తి, సంఘీభావానికి పేరుగాంచిన సిక్కు సమాజం పరువు తీస్తాయని ఆయన అన్నారు. ఆఫ్ఘన్ సిక్కులతో సహా వందలాది మందిని భారతదేశం ఖాళీ చేయించిన సమయాన్ని ఖలిస్తాన్ మద్దతుదారులకు గుర్తు చేస్తూ, గురు గ్రంథ్ సాహిబ్ కాపీలు కూడా కాబూల్ నుండి బయటికి వెళ్లేలా చూసేటట్లు చేసిన వీడియోను ట్విట్టర్‌లో బిజెపి నాయకుడు పంచుకున్నారు.

ఇవి కూడా చదవండి

లండన్ రాయబార కార్యాలయంలో త్రివర్ణ పతాకాన్ని అగౌరవపరిచిన కొద్దిమంది హేళనాత్మక చర్యను బహిరంగంగా ఖండించాలని ప్రపంచంలోని అన్ని ప్రాంతాలలో ఉన్న సిక్కులను నేను వినమ్రంగా కోరుతున్నాను అంటూ ట్విట్‌ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మనమంతా ఒక్కటై ముక్త కంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు.

ఖలిస్థానీ సానుభూతిపరుడు అమృత్‌పాల్‌ సింగ్‌ అనుచరులను పంజాబ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. అమృత్‌పాల్‌ సింగ్‌ కోసం కూడా పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గత రెండు, మూడు రోజులుగా పంజాబ్‌లో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. లండన్‌లోని భారత హైకమిషన్‌పై ఎగురుతున్న త్రివర్ణ పతాకాన్ని ఆదివారం వేర్పాటువాద ఖలిస్తానీ జెండాలు చేతబూని, ఖలిస్తానీ అనుకూల నినాదాలు చేశారు. హింసాత్మక రుగ్మతకు సంబంధించిన ఘటన పలువురి అరెస్టుకు దారితీసింది.

లండన్ లోని ఇండియన్ హై కమిషన్ వద్ద ఆదివారం కొంతమంది ఖలిస్థాని జెండాలు పట్టుకుని వచ్చారు. అక్కడి భారతదేశ జాతీయ జెండాను కిందకి లాగేశారు. ఖలిస్థాన్ కు మద్ధతుగా నినాదాలు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్‌గా మారింది. అందులో ఓ ఖలిస్థాని మద్ధతుదారుడు ఇండియా హౌస్ భవనంపై ఎక్కి జతీయ జెండాను కిందకి లాగాడు. ఇది గమనించిన ఓ ఇండియన్ అధికారి ఆ నిరసనకారుల నుంచి జెండాను లాక్కున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..