AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సీరియల్‌ కిస్సర్‌ మూతి పగలగొట్టిన పోలీసులు..! విచారణలో వణుకుపుట్టించే విషయాలు.. ఒక్కడే కాదు

మార్చి 10న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు మొత్తం అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అతడిని అరెస్ట్ చేయాలంటూ పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే..

సీరియల్‌ కిస్సర్‌ మూతి పగలగొట్టిన పోలీసులు..! విచారణలో వణుకుపుట్టించే విషయాలు.. ఒక్కడే కాదు
Serial Kisser
Jyothi Gadda
|

Updated on: Mar 20, 2023 | 6:26 PM

Share

Serial Kisser: గత కొద్ది రోజులుగా అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో హల్‌చల్‌ చేస్తున్న సీరియ‌ల్ కిస్సర్‌ను ఎట్టకేలకు పోలీసుల అరెస్ట్‌ చేశారు. బీహార్‌కు చెందిన ‘సీరియల్ కిస్సర్’ అరెస్ట్ అయ్యాడు. ఇంటర్‌నెట్‌ వేదికగా ఆడవాళ్లను హడలెత్తించిన కేటుగాడు ఒక్కడు కాదని తేల్చారు పోలీసులు. వైరల్‌ వీడియో ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పలు షాకింగ్‌ విషయాలను రాబట్టారు. ఉన్నట్టుండి ఆడవాళ్లపై బడి ముద్దులు పెట్టే వెర్రీవాడి వెనకాల ఒక ముఠాయే ఉన్నట్టుగా తేల్చారు పోలీసులు. ఈ ముఠాలోని వ్యక్తులు మహిళలను వేధించడం, ముద్దులు పెట్టడమే కాకుండా రాత్రి వేళల్లో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు చోరీకి గురైన వస్తువులను స్వాధీనం చేసుకునేందుకు జాముయి జిల్లాలోని మహిసౌధి బాబు తోలాపై దాడి చేశారు. ఈ దాడిలో సీరియల్ కిస్సర్ గ్యాంగ్ లీడర్ పోలీసులకు పట్టుబడ్డాడు. ముఠా నాయకుడు సహా నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు.

బీహార్‌లోని జముయి జిల్లాలోని సదర్ ఆసుపత్రి ప్రాంగణంలో ఒక మహిళ మొబైల్ ఫోన్‌లో మాట్లాడుతుండగా.. అకస్మాత్తుగా వెనుక నుండి వచ్చిన ఒక యువకుడు ఆమెను బలవంతంగా ముద్దుకున్నాడు. అనంతరం అక్కడి నుంచి క్షణాల్లో పారిపోయాడు.. మార్చి 10న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు మొత్తం అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అతడిని అరెస్ట్ చేయాలంటూ పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే నిందితుడి కోసం వెతుకుతున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. సీరియల్‌ కిస్సర్‌ అక్రమ్‌గా పోలీసులు తేల్చారు.

ఇవి కూడా చదవండి

సీరియల్ కిస్సర్ గ్యాంగ్ లీడర్‌గా మొహమ్మద్ అని పోలీసులు గుర్తించారు. ముఠాతో సంబంధమున్న మరికొందరు వ్యక్తుల సమాచారాన్ని కూడా సేకరిస్తున్నారు. పోలీసుల విచారణలో అక్రమ్ పలు రహస్యాలను బయటపెట్టాడు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు ఎన్నో చేశానని చెప్పాడు. గతంలో జరిగిన కేసుల్లో పలువురు మహిళలు జరిగిన విషయాన్ని ఎవరికీ చెప్పుకోకపోవటంతో, ఇంతకాలం ఎలాంటి కేసు బయటకు రాలేదని, పోలీస్‌ స్టేషన్లలోనూ ఎలాంటి కేసులు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..