ఆ రాష్ట్రానికి తొలి ట్రాన్స్‌జెండర్‌ లాయర్..ఇంతకీ ఎవరంటే

ట్రాన్స్ జెండర్ లు అంటే సమాజంలో వారిపై చులకన భావం ఉంటుంది. కాని కొంత మంది ట్రాన్స్ జెండర్లు సాధించే విజయాలు తమల ఉన్నవాళ్లందరికీ స్పుర్తినిచ్చేలా ఉంటాయి.

ఆ రాష్ట్రానికి   తొలి ట్రాన్స్‌జెండర్‌ లాయర్..ఇంతకీ ఎవరంటే
Padma Laxmi
Follow us
Aravind B

|

Updated on: Mar 20, 2023 | 5:55 PM

ట్రాన్స్ జెండర్ లు అంటే సమాజంలో వారిపై చులకన భావం ఉంటుంది. కాని కొంత మంది ట్రాన్స్ జెండర్లు సాధించే విజయాలు తమల ఉన్నవాళ్లందరికీ స్పుర్తినిచ్చేలా ఉంటాయి. అయితే తాజాగా ఇప్పుడు అలాంటి సంఘటనే చోటుచేసుకుంది. కేరళకు చెందిన పద్మాలక్ష్మీ తొలి ట్రాన్స్‌జెండర్‌ న్యాయవాదిగా నిలిచింది. భారతదేశపు మొట్టమొదటి ట్రాన్స్‌ జెండర్‌ జడ్జీగా నిలిచిన జోయిత్‌ మోండల్‌ తర్వాత పద్మ లక్ష్మీ అనే ట్రాన్స్‌జెండర్‌ ఆ విజయాన్ని సాధించారు. ఈ మేరకు కేరళ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి రాజీవ్‌ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ విషయాన్ని చెబుతూ..ఆమె ఫోటోలను కూడా షేర్‌ చేశారు. ఆమె గురించి మాట్లాడుతూ..ఆదివారం బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా నిర్వహించిన బార్‌ ఎన్‌రోల్‌మెంట్‌ సర్టిఫికేట్‌ కార్యక్రమంలో నమోదు చేసుకున్న 1500 మందికి పైగా లా గ్రాడ్యుయేట్ అయిన వారిలో పద్మాలక్ష్మీ కూడా ఒకరు అని వ్యాఖ్యానించారు.

పద్మజాలక్ష్మీ ఎర్నాకులం ప్రభుత్వ న్యాయ కళాశాలలో పట్టుభద్రురాలైందని మంత్రి రాజీవ్ తెలిపారు. తన కోసం ఒక మార్గాన్ని ఎంచుకుని ఆ దిశగా విజయాన్ని అందుకోవడం కోసం ఎన్నో అడ్డంకులను ఎదుర్కొందని, ముఖ్యంగా సమాజం నుంచి ఎదురైన సవాళ్లను అధిగమించి అనుకున్న గమ్యానికి చేరుకుని విజయం సాధించిందని ప్రశంసించారు. ఎట్టకేలకు ఆమె అనుకున్న లక్ష్యం సాధించి న్యాయచరిత్రలో తన పేరును నమోదు చేసుకుందన్నారు. ఆమె ఎంతో మందికి ఆదర్శంగా నిలవడమే గాక తనలాంటి వాళ్లు ఈ రంగంలో వచ్చేందుకు ఒక ప్రేరణగా నిలుస్తుందని కొనియాడారు. నెటిజన్లు ఆమెకు సోషల్ మీడియాలో అభినందనలు తెలుపుతున్నారు. అయితే తొలి ట్రాన్స్‌జెండర్‌ జడ్జి జోయితా మోండల్‌ తదనంతరం 2018లో ట్రాన్స్‌జెండర్‌ కార్యకర్త విద్యా కాంబ్లే మహారాష్ట్రలో నాగ్‌పూర్‌లోని లోక్‌ అదాలత్‌ జడ్జిగా నియమితులయ్యారు. ఆ తర్వాత ఏడాదే మూడో ట్రాన్స్‌జెండర్‌ జడ్జిగా గౌహతి నుంచి స్వాతి బిధాన్‌ నియమితులయ్యారు

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by P Rajeev (@prajeevofficial)

మరిన్నిజాతీయ వార్తల కోసం..

శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన
సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన
ఆ కార్లపై నమ్మలేని ఆఫర్లు..ఆ మోడల్‌కు మాత్రమే ప్రత్యేక తగ్గింపులు
ఆ కార్లపై నమ్మలేని ఆఫర్లు..ఆ మోడల్‌కు మాత్రమే ప్రత్యేక తగ్గింపులు