PM Modi: మోదీ జపం చేస్తున్న చైనీయులు.. ప్రేమగా ఏమని పిలుస్తున్నారో తెలుసా..
శత్రు దేశాల్లోని జనం కూడా భారత ప్రధాని నరేంద్ర మోదీ జపం చేస్తున్నారు. మాకు మోదీ కావాలి..! మోదీ.. మోదీ.. మోదీ.. ఇప్పుడు ఆయా దేశాల్లో నమో మంత్రం మారుమ్రోగుతోంది.
ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా ఏడుసార్లు..డబుల్ హ్యాట్రిక్.. అయినా ఆయన మేనియా తగ్గలేదు. గత రికార్డులన్నీ తిరగరాస్తూ మరోసారి బంపర్ మెజార్టీ సాధించి చరిత్ర సృష్టించారు. అధికారాన్ని కొనసాగిస్తున్న బీజేపీకి మోదీనే బ్రాండ్ అంబాసిడర్‌గా మారారు. మోదీ వ్యతిరేక శక్తులన్నీ ఏకమైనా మోదీ మేనియా ముందు తేలిపోయారు. ఓట్లు, సీట్లు పెరగడంతోపాటు బీజేపీ జోరు అమాంతం పెరిగిపోయింది. ఇది మనం దేశంలో.. ఇప్పుడు ఆయన నామ జపం దేశం దాటింది. భారతీయులు ఎక్కువగా ఉండే అమెరికా వంది దేశాల్లో కామన్. శత్రు దేశాల్లోని జనం కూడా భారత ప్రధాని నరేంద్ర మోదీ జపం చేస్తున్నారు. మాకు మోదీ కావాలి..! మోదీ.. మోదీ.. మోదీ.. ఇప్పుడు ఆయా దేశాల్లో నమో మంత్రం మారుమ్రోగుతోంది.
రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలున్నా భారత ప్రధాని మోదీకి చైనా ప్రజల్లో భారీగా ఆదరణ పెరుగుతోంది. మోదీని చైనీయులు అసాధారణ వ్యక్తిగా పరిగణిస్తున్నారని అమెరికా పత్రిక ‘డిప్లొమాట్’ పేర్కొంది. ఈ మేరకు ఒక భారీ స్టోరీని ప్రచూరించింది. మోదీ నాయకత్వంలోని భారత్ అగ్ర దేశాల మధ్య సమతూకం పాటిస్తోందని చైనా వ్యవహారాలను విశ్లేషించే జర్నలిస్టు ము షుంషాన్ అందులో చెప్పడం విశేషం.
‘మోదీ లాక్షియన్’ అని చైనీయులు సామాజిక మాధ్యమాల్లో మోదీకి పేరు పెట్టుకున్నారు. అసాధారణ సామర్థ్యమున్న దివ్య పురుషుడు అని దాని అర్థం. మోదీ మిగిలిన నేతలకన్నా విభిన్నంగా ఉంటారని ఆయన విశ్లేషించారు. మోదీ వస్త్రధారణ, రూపం అసాధారణంగా ఉంటాయని.. ఆయన విధానాలూ గత నేతలకన్నా భిన్నంగా ఉంటాయని చైనీయులు చెప్పు కోవడం విశేషం.
రష్యా, అమెరికా, దక్షిణ దేశాలతో మోదీ స్నేహంగా ఉంటారనేది చైనీయుల అభిప్రాయమని చైనా జర్నలిస్ట్ షుంషాన్ వివరించారు. 20ఏళ్ల నుంచీ అంతర్జాతీయ మీడియా వార్తలను తాను అందిస్తున్నానని, కానీ చైనీయులు ఒక విదేశీ నేతకు ముద్దుగా.. ప్రేమతో ఇలా పేరు పెట్టడం ఎప్పుడూ చూడలేదని.. వినలేదని పేర్కొన్నారు.
చైనీయుల దృష్టిలో ప్రధాని మోదీకి ఓ ప్రత్యేక స్థానముందని అన్నారు షంషాన్. చైనాలో ట్విటర్‌కు పోటీగా వచ్చిన ‘సైనా వీబో’లో మోదీ 2015లో చేరారు. ఆయనకు 2.44 లక్షల మంది ఫాలోయర్లు ఉన్నారు. అయితే చైనా యాప్‌లపై నిషేధంలో భాగంగా 2020 జులై తర్వాత ఆయన తన ఖాతాను మూసేశారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం