Cherry Blossom 2023: ముందే వచ్చేసిన పూల ఫెస్టివల్‌.. విరబూసిన పరిమళాలతో అందంగా కనిపిస్తున్న చెర్రీ బ్లాసమ్‌ సీజన్‌

Cherry Blossom 2023: జపాన్‌లో పూల పండగ వచ్చేసింది. విరబూసిన పరిమళాలతో ఎంతో అందంగా కనిపిస్తున్న చెర్రీ బ్లాసమ్‌ చెట్ల కింద కూర్చొని వేడుకలు చేసుకుంటున్నారు జపనీయులు.

Cherry Blossom 2023: ముందే వచ్చేసిన పూల ఫెస్టివల్‌.. విరబూసిన పరిమళాలతో అందంగా కనిపిస్తున్న చెర్రీ బ్లాసమ్‌ సీజన్‌
Cherry Blossom 2023
Follow us
Balaraju Goud

|

Updated on: Mar 20, 2023 | 9:44 AM

జపాన్‌లో పూల పండగ వచ్చేసింది. విరబూసిన పరిమళాలతో ఎంతో అందంగా కనిపిస్తున్న చెర్రీ బ్లాసమ్‌ చెట్ల కింద కూర్చొని వేడుకలు చేసుకుంటున్నారు జపనీయులు. వాతావరణ మార్పుల కారణంగా ఈ ఏడాది చెర్రీ బ్లాసమ్‌ సీజన్‌ ముందే వచ్చేసింది. దీంతో తెగ ఎంజాయ్‌ చేస్తున్నారు. సాధారణంగా మార్చి చివరి వారంలో ఈ చెట్లు విరగబూస్తాయి. కానీ ఈ ఏడాది పది రోజుల ముందే రోడ్లకు ఇరువైపులా తెలుపు, గులాబీ రంగుల్లో పువ్వులు విరగబూసాయి. కొన్ని చెట్లకు పసుపు, ఆకుపచ్చ రంగుల్లో కూడా పూలు పూసాయి.

ఈ పూలు కేవలం 15 నుంచి నెల రోజుల వరకు మాత్రమే ఉండి ఆ తర్వాత నేల రాలిపోతాయి. అందుకే ఈ సీజన్‌లో జపాన్‌లో ఒక పండుగ వాతావరణం నెలకొని ఉంటుంది. చెర్రీ బ్లాసమ్‌ని మహోత్సవంలా నిర్వహిస్తారు. దీనినే హనామీ ఫెస్టివల్‌ అంటారు. ఇది జపాన్‌ జాతీయ పండుగ. వెయ్యేళ్ల క్రితం నుంచే హనామీ ఉత్సవాలు జపాన్‌ ప్రజలు జరుపుకుంటున్నారు.

ఈ సీజన్‌లో ప్రజలు తమ బాధలన్నీ మర్చిపోయి రోజంతా చెట్ల కింద ఆడుకుంటారు. పాడుకుంటారు. ముచ్చట్లు చెప్పుకుంటారు. అక్కడే సేద తీరుతారు. పార్కులు, రోడ్డుకిరువైపులా చెర్రీలు కనువిందు చేస్తుంటే ప్రజలు గుంపులు గుంపులుగా వచ్చి చీర్స్‌ చెప్పుకుంటూ ఎంజాయ్‌ చేస్తారు. చైనా, కొరియా, తైవాన్, యూరప్, అమెరికా దేశాల్లో కూడా చెర్రీ బ్లాసమ్‌ చెట్లు ఉన్నప్పటికీ జపాన్‌లో మాత్రం ఒక పండుగలా జరుపుకుంటారు. ఈ సీజన్‌లో జపాన్‌కు ఏటా 23 లక్షల విదేశీ పర్యాటకులు వస్తుంటారు. దీంతో దేశ ఖజానాకు దాదాపు 62 కోట్ల యెన్‌ల ఆదాయం వస్తుందట. మొత్తానికి ఆహ్లాదానికి ఆహ్లాదం.. ఆదాయానికి ఆదాయం అన్నమాట.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం